ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్( భౌతిక శాస్త్రం) PHYSICS లో మొత్తం 15 చాప్టర్స్ ఉంటాయి. వేవ్స్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ పొటన్షియల్ అండ్ కెపాసిటన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నటిజమ్, మాగ్నటిజమ్, ఎలక్ట్రో మాగ్నటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రో మాగ్నటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మేటర్, ఆటమ్స్, న్లూక్లియై, సెమీ కండక్టర్ డివైజెస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ చాప్టర్లు ఉన్నాయి. వీటిలో మొత్తం అన్ని చాప్టర్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. కోవిడ్ కారణంగా గత ఏడాది కొంత సిలబస్ తగ్గించడం జరిగింది. ఈ ఏడాది కూడా 30 శాతం మేర సిలబస్ తగ్గించి, ఉన్న చాప్టర్స్ నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉండే అవకాశం ఉంది. తగ్గించిన 30 శాతం సిలబస్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
తగ్గించిన సిలబస్ వివరాలు
కొంచెం ప్లాన్డ్ గా, జాగ్రత్తగా చదివితే.. ఫిజిక్స్ లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ప్లాన్డ్ గా చదవడం, ఆ చదివినదాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం, పరీక్షలో తడబాటు లేకుండా రాయడం కోసం.. చదివిన తర్వాత.. పేపర్ మీద ప్రెజెంట్ చేస్తే మంచిది. ప్రతీదీ ఎగ్జామ్స్ తరహాలో ముందునుండే ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో మొత్తం 60 మార్కులు ఉంటాయి. ఇందులో మూడు 8 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు, ఎనిమిది 4 మార్కుల ప్రశ్నలు, 10 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
మొదట 8 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఒక ఛాయిస్ క్వశ్చన్ తో పాటు మొత్తం మూడు ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇస్తారు. వీటిలో రెండు రాయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చదివితే ఈ రెండు ప్రశ్నలు రాసేయవచ్చు. ప్రధానంగా సెకండ్ ఇయర్ లో ఉన్న 15 చాప్టర్స్ లో మూడు చాప్టర్స్ నుండే ఈ మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వేవ్స్ అనే చాప్టర్ లో మూడు 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఏదో ఒక ప్రశ్న రావచ్చు. ఈ చాప్టర్ జాగ్రత్తగా చదివితే.. పరీక్షలో వచ్చే ఒక 8 మార్కుల ప్రశ్న సులభంగా రాయొచ్చు. ఇక మరో చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుండి మూడు 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ చాప్టర్ చదివితే ఒక 8 మార్కుల ప్రశ్న రాసేయవచ్చు.
ఈ చాప్టర్ నుండగి ప్లాబ్లమ్స్ కూడా ఇవ్వొచ్చు. ఒక్క ప్రశ్నలోనే రెండు ప్రశ్నలు కూడా ఉండొచ్చు. ఒక 6 మార్కుల ధియరీ, 2 మార్కుల ప్రాబ్లమ్ ప్రశ్న కూడా ఇవ్వొచ్చు. ఇక మరో చాప్టర్ న్లూక్లియే నుండి.. న్యూక్లియర్ రియాక్టర్ అనే ఒక ప్రశ్న ఉంటుంది. అది ఖచ్చితంగా పరీక్షలో రావొచ్చు. న్యూక్లియర్ రియాక్టర్ ప్రశ్న ప్రతీ ఏడాది రిపీట్ అవుతుందని, 90 శాతం రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఫిజిక్స్ పేపర్ లో 4 మార్కులు ప్రశ్నలు 8 ఇస్తారు. 6 రాయాల్సి ఉంటుంది.
సెలక్టివ్ గా కొన్ని చాఫ్టర్స్ నుండి చదివితే సరిపోతుందని, 4 మార్కుల ప్రశ్నలు ఆరూ రాసేయవచ్చని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండు ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ పొటన్షియల్ అండ్ కెపాసిటన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నటిజమ్, ఎలక్ట్రో మాగ్నటిక్ ఇండక్షన్, సెమీ కండక్టర్ డివైజెస్.. ఈ చాఫ్టర్స్ లో ప్రతి చాప్టర్స్ లో 3 నుండి 4 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. కాబట్టి టోటల్ గా ఈ చాప్టర్స్ నుండి 24 ప్రశ్నలు చదివితే.. 6 ప్రశ్నలు తప్పనిసరిగా సులభంగా రాసేయొచ్చు.
ఇక 2 మార్కుల ప్రశ్నలు.. 10 ఇస్తారు. 10 కూడా రాయాల్సి ఉంటుంది. ఈ పది ప్రశ్నలు మొత్తం అన్ని చాప్టర్స్ నుండి రావొచ్చు. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మేటర్ నుండి 2 ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక ప్రాబ్లమ్, ఒక ధియరీ ప్రశ్న ఉంటాయి. ఇక రే ఆప్టిక్స్ చాప్టర్ నుండి ఒక ప్రాబ్లమ్ గానీ ధియరీ ప్రశ్న గానీ రావొచ్చు. ఇక మిగిలిన చాప్టర్లు అయిన ఎలక్ట్రిక్ పొటన్షియల్ అండ్ కెపాసిటన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నటిజమ్, మాగ్నటిజమ్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రో మాగ్నటిక్ వేవ్స్, సెమీ కండక్టర్ డివైజెస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుండి ఒక్కో ప్రశ్న వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చదివితే.. ఈ పది 2 మార్కుల ప్రశ్నలు ఈజీగా రాయొచ్చని సబ్జెక్ట్ టీచర్లు చెబుతున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.