హోమ్ /వార్తలు /jobs /

AP Inter 2nd Year Maths Syllabus: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. మారిన మాథ్స్ సిలబస్ ఇదే..

AP Inter 2nd Year Maths Syllabus: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. మారిన మాథ్స్ సిలబస్ ఇదే..

కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఈ సారి ఇంటర్ సిలబస్ ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పై విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. అలాంటి వారి కోసం సిలబస్ వివరాలు..

కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఈ సారి ఇంటర్ సిలబస్ ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పై విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. అలాంటి వారి కోసం సిలబస్ వివరాలు..

కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఈ సారి ఇంటర్ సిలబస్ ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పై విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. అలాంటి వారి కోసం సిలబస్ వివరాలు..

  సేకరణ: ఆనంద్ మోహన్, న్యూస్ 18 కరస్పాండెంట్,  విశాఖపట్నం

  ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లానే ఎక్కువ మార్కులతో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మాధమేటిక్స్ అనే చెప్పాలి. మాథ్స్ కు మొత్తం 150 మార్కులు ఉంటాయి. సెకండ్ ఇయర్ మాథ్స్ సిలబస్ 2A, 2Bగా రెండు విభాగాలు ఉంటాయి. ప్రశ్నాపత్రంలో కూడా 2Aలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు, 2Bలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కోవిడ్ కారణంగా 2A, 2B విభాగాల నుండి గత ఏడాది తగ్గించిన విధంగానే ఈ ఏడాది కూడా సుమారు 30 శాతం టాపిక్ లను, అందులోని సబ్ టాపిక్స్ ను తొలగించారు. అందువల్ల సిలబస్ నుండి తీసేసిన టాపిక్స్ మినహాయించి మిగిలిన అంశాలనుండే సెకండ్ ఇయర్ మాథమేటిక్స్ ప్రశ్నాపత్రం వస్తుంది.

  2Aలో ఆల్ జీబ్రా, ప్రోబబిలిటీ ఉంటాయి. ఆల్జీబ్రా (ALGEBRA)లో COMPLEX NUMBERS, DE MOIVRE'S THEROEM, QUADRATIC EXPRESSIONS, THEORY OF EQATIONS, PERMUTATIONS AND COMBINATIONS, PARTIAL FRACTIONS అనే టాపిక్స్ ఉంటాయి. ఇక 2Aలో రెండవ విభాగంగా ప్రోబబిలిటీ (PROBABILITY) వుంది. ఇందులో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ రేంజ్ (MEASURES OF DISPERSION RANGE), ప్రోబబిలిటీ(PROBABILITY), రేండమ్ వేరియబుల్స్ అండ్ ప్రోబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ (RANDOM VARIABLES AND PROBABILITY DISTRIBUTIONS) అనే టాపిక్స్ ఉంటాయి.

  AP Inter 2nd Year: ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష సిలబస్ వివరాలివే

  2Bలో కోఆర్డినేట్ జామెట్రీ (COORDINATE GEOMETRY) విభాగంలో  సర్కిల్(CIRCLE), సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ( SYSTEM OF CIRCLES), పేరాబోలా (PARABOLA), ఎలిప్స్(ELLIPSE), హైపర్ బోలా(HYBERPOLA) అనే టాపిక్స్ ఉన్నాయి.  మరో చాప్టర్ కాల్కులస్ (CALCULUS) లో ఇన్ డెఫినిట్ ఇంటిగ్రల్స్(INDEFINITE INTEGRALS) డెఫినిట్ ఇంటిగ్రల్స్(DEFINITE INTEGRALS), డిఫరెన్షియల్ ఈక్వేషన్ (DIFFERENTIAL EQUATION) అనే టాపిక్స్ ఉన్నాయి.

  AP 10th Exam Syllabus: ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఎగ్జామ్ హిందీ సబ్జెక్ట్ సిలబస్ వివరాలివే

  ఇందులో 2A లో వచ్చే 75 మార్కులకు 7 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. 2 ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. ఇక 4 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో ఐదు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు. ఇక 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. ఒక్కొక్కటి 2 మార్కుల చొప్పున 20 మార్కులకు పది 2 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఛాయిస్ ఉండదు.

  మొదట 2A లో 75 మార్కులకు ఒక్కొక్క టాపిక్ నుండి వచ్చే ప్రశ్నలను చూస్తే..  ALGEBRA విభాగం లో COMPLEX NUMBERS నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. రెండవ టాపిక్ DE MOIVRE'S THEROEM నుండి రెండు 7 మార్కుల ప్రశ్నలు, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. మూడవ టాపిక్ అయిన QUADRATIC EXPRESSIONS నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. THERORY OF EQATIONS రెండు 7 మార్కుల ప్రశ్నలు, ఒక రెండు మార్కుల ప్రశ్న PERMUTATIONS AND COMBINATIONS అనే టాపిక్స్ నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు, మూడు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక PARTIAL FRACTIONS అనే టాపిక్స్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న వస్తాయి.

  ఇక మరో విభాగం MEASURES OF DISPERSION RANGE నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. మరో విభాగం PROBABILITY నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక చివరి టాపిక్ RANDOM VARIABLES AND PROBABILITY DISTRIBUTIONS నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి.

  ఇందులో 2B లో వచ్చే 75 మార్కులకు 7 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. 2 ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. ఇక 4 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో ఐదు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు. ఇక 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. ఒక్కొక్కటి 2 మార్కుల చొప్పున 20 మార్కులకు పది 2 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఛాయిస్ ఉండదు.

  ఇక 2Bలో 75 మార్కులకు ఒక్కొక్క టాపిక్ నుండి వచ్చే ప్రశ్నలు చూద్దాం. మొదటి విభాగం COORDINATE GEOMETRYలో CIRCLE అనే టాపిక్ నుండి రెండు 7 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. SYSTEM OF CIRCLES అనే టాపిక్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. PARABOLA అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. ఇక ELLIPSE అనే టాపిక్ నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. HYBERPOLA అనే చివరి టాపిక్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి.

  ఇక మరో విభాగం CALCULUS లో INTEGRATION అనే టాపిక్ నుండి రెండు 7 మార్కుల ప్రశ్నలు, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. DEFINITE INTEGRALS అనే టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక DIFFERENTIAL EQUATION అనే చివరి టాపిక్ నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి.

  ఇలా సెకండ్ ఇయర్ మాథమేటిక్స్ లో ప్లాన్డ్ గా చదివితే.. పరీక్ష మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 2A నుండి 75 మార్కుల్లో ఉన్న మూడు విభాగాలలో DE MOIVRE'S THEROEM, THERORY OF EQATIONS, PROBABILITY, PERMUTATIONS AND COMBINATIONS ఈ నాలుగు టాపిక్ లను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే.. 2A లో 75 శాతానికి పైగా మార్కులు తెచ్చుకోవచ్చు. COORDINATE GEOMETRY లోని CIRCLE అనే టాపిక్ CALCULUS లో INTEGRATION అనే టాపిక్ ను పూర్తిగా ప్రాక్టీస్ చేయగలిగితే.. 2Bలో 50 శాతానికి పైగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక మిగిలిన  కొన్ని టాపిక్స్ లను, ఫార్ములాలను గుర్తు పెట్టుకుంటే.. మంచి మార్కులతో పాసయ్యే అవకాశం ఉంది.

  First published:

  ఉత్తమ కథలు