హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter 2nd Year Maths 2A Paper: ఏపీ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు అలర్ట్.. మాథ్స్ మోడల్ పేపర్ ఇదే..

AP Inter 2nd Year Maths 2A Paper: ఏపీ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు అలర్ట్.. మాథ్స్ మోడల్ పేపర్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లానే ఎక్కువ మార్కులతో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మాథమేటిక్స్ అనే చెప్పాలి. మొత్తం 75 మార్కులకు మాథమేటిక్స్ సెకండ్ ఇయర్ (2A) పేపర్ వస్తుంది.

సేకరణ: ఆనంద్ మోహన్, న్యూస్18 కరస్పాండెంట్, విశాఖపట్నం 

ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లానే ఎక్కువ మార్కులతో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే అది మాథమేటిక్స్ అనే చెప్పాలి. మొత్తం 75 మార్కులకు మాథమేటిక్స్ సెకండ్ ఇయర్ (2A) పేపర్ వస్తుంది. సెకండ్ ఇయర్ మేధ్స్ సిలబస్ ను 2A, 2B విభాగాలుగా చేసారు. ప్రశ్నాపత్రంలో కూడా 2Aలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు, 2Bలో ఉన్న చాప్టర్ల నుండి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కోవిడ్ కారణంగా 2A, 2B విభాగాల నుండి గత ఏడాది తగ్గించిన విధంగానే ఈ ఏడాది కూడా సుమారు 30 శాతం టాపిక్ లను, అందులోని సబ్ టాపిక్స్ ను తొలగించారు. అందువల్ల సిలబస్ నుండి తీసేసిన టాపిక్స్ మినహాయించి మిగిలిన అంశాలనుండే సెకండ్ ఇయర్ మాథమేటిక్స్ ప్రశ్నాపత్రం వస్తుంది. మొదట 2A లో ఉన్న సిలబస్ చూద్దాం. ఇందులో ఆల్ జీబ్రా, ప్రోబబిలిటీ అనే రెండు విభాగాలు ఉంటాయి. ఆల్జీబ్రా (ALGEBRA)లో COMPLEX NUMBERS, DE MOIVRE'S THEROEM, QUADRATIC EXPRESSIONS, THEORY OF EQATIONS, PERMUTATIONS AND COMBINATIONS, PARTIAL FRACTIONS అనే టాపిక్స్ ఉంటాయి.

ఇక 2Aలో రెండవ విభాగంగా ప్రోబబిలిటీ (PROBABILITY) వుంది. ఇందులో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ రేంజ్ (MEASURES OF DISPERSION RANGE), ప్రోబబిలిటీ(PROBABILITY), రేండమ్ వేరియబుల్స్ అండ్ ప్రోబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ (RANDOM VARIABLES AND PROBABILITY DISTRIBUTIONS) అనే టాపిక్స్ ఉంటాయి. ఇందులో 2A లో 75 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. మొదట 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. వీటికి ఛాయిస్ ఉండదు. 10 రాయాల్సి ఉంటుంది. తరువాత.. 4 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో ఐదు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు. చివరిగా.. 7 మార్కుల ప్రశ్నలు ఏడు ఇస్తారు. ఇందులో 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. 2 ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి.

చాప్టర్ల వారీగా ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్కుల ప్రశ్నలు వస్తాయో చూద్దాం. మొదట 2A లో 75 మార్కులకు వచ్చే ప్రశ్నాపత్రాన్ని చూస్తే.. మొదట 2A లో 75 మార్కులకు ఒక్కొక్క టాపిక్ నుండి వచ్చే ప్రశ్నలను చూస్తే..  ALGEBRA విభాగం లో COMPLEX NUMBERS నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. రెండవ టాపిక్ DE MOIVRE'S THEROEM నుండి రెండు 7 మార్కుల ప్రశ్నలు, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. మూడవ టాపిక్ అయిన QUADRATIC EXPRESSIONS నుండి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి.

THERORY OF EQATIONS రెండు 7 మార్కుల ప్రశ్నలు, ఒక రెండు మార్కుల ప్రశ్న PERMUTATIONS AND COMBINATIONS అనే టాపిక్స్ నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు, మూడు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక PARTIAL FRACTIONS అనే టాపిక్స్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న వస్తాయి. ఇక మరో విభాగం ప్రోబబిలిటీ (PROBABILITY)లో MEASURES OF DISPERSION RANGE నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. PROBABILITY నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక చివరి టాపిక్ RANDOM VARIABLES AND PROBABILITY DISTRIBUTIONS నుండి ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి.

సెకండ్ ఇయర్ మేథ్స్ 2A లో సింపుల్ గా మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలి? ఏ చాప్టర్లు ప్రాక్టీస్ చేయాలి?సెకండ్ ఇయర్ మాథ్స్ పేపర్ లో వచ్చే 150 మార్కుల్లో వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించాలంటే.. కొన్ని లాజిక్స్ తెలియాల్సిన అవసరముంది. మొదట 2A చూద్దాం. ఇందులో ఉండే 75 మార్కుల్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. ఫస్ట్ రెండు చాప్టర్లు అయిన COMPLEX NUMBERS, DE MOIVRE'S THEROEM లను ఒకే యూనిట్ గా భావించి ప్రిపేర్ అవ్వాలి. చాలా తక్కువ టాపిక్స్, తక్కువ ఎక్సర్సైజ్ లతో సింపుల్ గా ఉండే ఈ రెండు చాప్టర్లలోని ప్రాబ్లమ్స్ ను ప్రాక్టీస్ చేస్తే, బాగా ప్రిపేర్ అయితే.. రెండు 7 మార్కుల ప్రశ్నలు రాయడంతో పాటు.. 24 మార్కులు సాధించవచ్చు.

ఇక లాస్ట్ 7,9 చాప్టర్స్ అయిన ప్రోబబిలిటీ(PROBABILITY), ప్రోబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ (RANDOM VARIABLES AND PROBABILITY DISTRIBUTIONS) అనే టాపిక్స్ ను ప్రిపేర్ అవ్వాలి. చాలా తక్కువ ఎక్సర్సైజ్ లు ఉండే.. ఈ రెండు చాప్టర్లను ప్రిపేర్ అయితే.. మరో 24 మార్కులు సాధించవచ్చు. మొత్తంగా ఇప్పటివరకూ మనం చెప్పుకున్న 4 చాప్టర్ల లను ప్రిపేర్ అయితే.. 48 మార్కులు సాధించవచ్చు. తరువాత 3వ చాప్టర్ అయిన QUADRATIC EXPRESSIONS, 4వ చాప్టర్ THERORY OF EQATIONS అనే ఈ రెండు చాప్టర్లను ప్రిపేర్ అవ్వాలి.

వీటిలో కూడా తక్కువ ఎక్సర్సైజ్ లు ఉండే ఈ రెండు చాప్టర్లను చదివితే.. రెండు 7 మార్కుల ప్రశ్నలు రాయగలగడంతో మొత్తం 22 మార్కులు సాధించవచ్చు. ఇక తరువాత PERMUTATIONS AND COMBINATIONS అనే టాపిక్ ను ప్రిపేర్ అవ్వాలి. ఇందులో ఈ చాప్టర్ లో ఈజీగా ఉండే రెండవ టాపిక్ అయిన COMBINATIONS నుండి ఒక 4 మార్కుల ప్రశ్న తప్పక వస్తుంది. మొత్తంగా ఇక్కడికి 71 మార్కులకు ఈజీగా సమాధానాలు రాయవచ్చు. ఎక్కువ మార్కులు సాధించవచ్చు. తరువాత సులువుగా ఉండే టాపిక్ అయిన PARTIAL FRACTIONS ప్రిపేర్ అయితే.. మరో 4 మార్కుల ప్రశ్న రాసేయవచ్చు.

దీంతో మొత్తంగా 75 మార్కులు 2A నుండి సాధించవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే..  2A నుండి 75 మార్కుల్లో ఉన్న మూడు విభాగాలలో DE MOIVRE'S THEROEM, THERORY OF EQATIONS, PROBABILITY, PERMUTATIONS AND COMBINATIONS ఈ నాలుగు టాపిక్ లను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే.. 2A లో 75 శాతానికి పైగా మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల ఈ టాపిక్ లను చదివి, ప్రాక్టీస్ చేసి సమాధానాలు రాయగలిగితే.. ఇక మిగిలిన  కొన్ని టాపిక్స్ లను, ఫార్ములాలను గుర్తు పెట్టుకుంటే.. మంచి మార్కులతో పాసయ్యే అవకాశం ఉంది.

First published:

Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams

ఉత్తమ కథలు