హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter Second Inter Civics Syllabus: ఏపీలో ఇంటర్ సెకండియర్ సివిక్స్ సిలబస్ ఇసారి ఇలా.. ఓ లుక్కేయండి

AP Inter Second Inter Civics Syllabus: ఏపీలో ఇంటర్ సెకండియర్ సివిక్స్ సిలబస్ ఇసారి ఇలా.. ఓ లుక్కేయండి

కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఇంటర్ సిలబస్ ను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది.

కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఇంటర్ సిలబస్ ను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది.

కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఇంటర్ సిలబస్ ను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది.

    సేకరణ: హేమంత్ కుమార్, న్యూస్18 తెలుగు కరస్పాండెంట్, తిరుపతి

    కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఇంటర్ సిలబస్ ను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. ఈ నేపథ్యంలో సెకండియర్ సివిక్స్  సిలబస్ వివరాలు ఇలా ఉన్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం కుదించిన 70% సిలబస్ లో 13 చాప్టర్ లు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు., 5 మార్కుల ప్రశ్నలు., 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మెరుగైన మార్కులు  రావాలంటే... కచ్చితంగా అన్ని చాప్టర్లను బాగా చదువుకోవాలి.

    చాప్టర్ వారీగా ఉన్న పాఠ్యంశాల వివరాలు ఇలా ఉన్నాయి.

    అధ్యాయం 1: భారత రాజ్యాంగం

    రాజ్యాంగం, భారత రాజ్యాంగ నిర్మాణం., భారత రాజ్యాంగం - ఆధారాలు., భారత రాజ్యాంగ పీఠిక., భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు

    అధ్యాయం 2: ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలు

    ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధులు

    అధ్యాయం 3: కేంద్ర కార్యనిర్వాహక శాఖ

    కేంద్ర కార్యనిర్వహక శాఖ, భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి.

    అధ్యాయం 4: కేంద్ర శాసన నిర్మాణ శాఖ

    కేంద్ర శాసననిర్మాణ శాఖ (పార్లమెంటు),కేంద్ర శాసననిర్మాణ శాఖ ముఖ్యలక్షణాలు, లోక్ సభ, లోక్సభ స్పీకరు (సభాపతి), రాజ్యసభ, రాజ్యసభ అధ్యక్షుడు, పార్లమెంటు (కేంద్ర శాసన నిర్మాణ శాఖ) అధికారాలు-విధులు, పార్లమెంటులో బిల్లుల రకాలు, పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియ, పార్లమెంటులో ముఖ్యమైన అంశాలు, పార్లమెంటరీ కమిటీలు, భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియ, కేంద్ర శాసన సభ(పార్లమెంటు) ప్రాముఖ్యత

    అధ్యాయం 5: కేంద్ర న్యాయశాఖ

    భారత సుప్రీంకోర్టు,సుప్రీంకోర్టు అధికారాలు-విధులు, న్యాయ సమీక్ష, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, భారత అటార్నీ జనరల్

    అధ్యాయం 6: రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ

    రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, గవర్నర్, గవర్నర్ అధికారాలు-విధులు, ముఖ్యమంత్రి, అధికారాలు-విధులు, ముఖ్యమంత్రికి -గవర్నర్ల మద్య గల సంబంధం, ముఖ్యమంత్రి స్థానం, ప్రాముఖ్యత, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర మంత్రిమండలి స్థానం, రాష్ట్ర మంత్రిమండలి - గవర్నర్ల మధ్య గల సంబంధం

    అధ్యాయం 7: రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

    విధాన సభ, విధానసభ అధికారాలు - విధులు, విధాన పరిషత్, విధాన పరిషత్తు అధికారాలు - విధులు, విధాన పరిషత్తుపై విధానసభ ఆధిక్యత, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ స్థానం, ఆంధ్రప్రదేశ్ శాసననిర్మాణశాఖ సంక్షిప్త చరిత్ర, శాసనసభా కమిటీలు

    అధ్యాయం 8: రాష్ట్ర న్యాయశాఖ

    హైకోర్టు అధికారాలు - విధులు, జిల్లాస్థాయి న్యాయ వ్యవస్థ, రాష్ట్ర అడ్వకేట్ జనరల్.

    అధ్యాయం 9: కేంద్ర, రాష్ట్ర సంబంధాలు

    కేంద్ర - రాష్ట్ర సంబంధాలు, శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి,  జాతీయ సమగ్రతా మండలి, అంతర్రాష్ట్ర మండలి 9.10 సర్కారియా కమీషన్, పూంఛీ కమీషన్, కేంద్ర - రాష్ట్ర సంబంధాలలో ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితులు, కేంద్ర - రాష్ట్ర సంబంధాలలో ఇటీవలి ధోరణులు

    అధ్యాయం 10: భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

    భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు., చారిత్రక నేపథ్యం., గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు., రాజ్యాంగ (73వ సవరణ) చట్టం, 1992., గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు - రకాలు 10.6 భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు., రాజ్యాంగ (74వ సవరణ) చట్టం, 1992., పట్టణ స్థానిక ప్రభుత్వాల రకాలు., జిల్లా కలెక్టర్.

    అధ్యాయం 11: ఎన్నికలు - ప్రాతినిధ్యం

    ఎన్నికలు, ప్రజాస్వామ్యము., ఎన్నికల సంబంధ విధులు., భారతదేశంలో ఎన్నికల విధానం., భారత ఎన్నికల వ్యవస్థ లక్షణాలు., ఎన్నికల పద్ధతులు., ఎన్నికల ప్రక్రియ., ఎన్నికలలో అక్రమపద్ధతులు., ఎన్నికల సంబంధమైన నేరాలు., అధికార కర్తవ్యాల ఉల్లంఘన., ప్రాతినిధ్యం., భారత ఎన్నికల సంఘం., భారత ఎన్నికల సంఘం అధికారాలు - విధులు., భారత ఎన్నికల సంఘం పాత్ర.,భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు

    అధ్యాయం 12 : రాజకీయ పార్టీలు

    అర్థం - నిర్వచనాలు., రాజకీయ పార్టీల లక్షణాలు., రాజకీయ పార్టీల రకాలు., రాజకీయ పార్టీల విధులు., పార్టీ వ్యవస్థ., పార్టీ వ్యవస్థ - రకాలు., భారతదేశంలో పార్టీ వ్యవస్థ., భారత పార్టీ వ్యవస్థ - లక్షణాలు., భారతదేశంలో ప్రధాన జాతీయ పార్టీలు., ఏక పార్టీ ఆధిపత్యం., భారతదేశంలో ప్రధాన ప్రాంతీయ పార్టీలు., ప్రాంతీయ రాజకీయ పార్టీలు - రకాలు., భారత రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత.

    అధ్యాయం 13: ఆంధ్రప్రదేశ్, ఇండియాలలో ఇటీవలి పరిణామాలు

    రాష్ట్రాల పునర్వవస్థీకరణ., ఆంధ్రరాష్ట్ర అవతరణ., ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం., 1969, 1972 లలో రాజకీయ సంక్షోభం., ఆంధ్రప్రదేశ్ విభజన., భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం., రాష్ట్ర మానవ హక్కుల సంఘం., సమాచార హక్కు చట్టం, 2005

    10 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు. మూడింటికి మాత్రమే సమాధానాలు రాస్తే చాలు. 5 మార్కుల ప్రశ్నలు 12 ఇప్పడం జరుగుతుంది. 8 ప్రశ్నలకు సముధానాలు వ్రాసి మిగిలిన 4 ప్రశ్నలు ఛాయస్ లో వదిలేయవచ్చు. వెనకబడిన విద్యార్థుల ఉతీర్ణత  విషయంలో కీలకపాత్ర పోషించేది 2 మార్కుల ప్రశ్నలే. కాబట్టి, వీరు వీటిపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి.

    First published:

    Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams

    ఉత్తమ కథలు