హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter 2nd year Chemistry: ఏపీ ఇంటర్ సెకండియర్ కెమిస్ట్సీ సిలబస్ ఇదే..

AP Inter 2nd year Chemistry: ఏపీ ఇంటర్ సెకండియర్ కెమిస్ట్సీ సిలబస్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 కోవిడ్ నిబంధనల కారణంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో కూడా రసాయన శాస్త్రము నుండి 30 శాతం మేర సిలబస్ తగ్గించి మిగిలిన చాప్టర్ల నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది.

సేకరణ: ఆనంద్ మోహన్, న్యూస్18 కరస్పాండెంట్, విశాఖపట్నం

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమెస్ట్రీ (రసాయన శాస్త్రం) CHEMISTRYలో మొత్తం 15 చాప్టర్స్ ఉంటాయి1) ఘన స్థితి (SOLID STATE)2) ద్రావణాలు (SOLUTIONS)3)విద్యుత్ రసాయన శాస్త్రం (ELECTRO CHEMISTRY and CHEMICAL KINETICS)4)ఉపరితల రసాయన శాస్త్రం ( SURFACE CHEMISTRY)6)పీ బ్లాక్ మూలకాలు & సమన్వయ సమ్మేళనాలు (P-BLOCK ELEMENTS)7) డీ అండ్ ఎఫ్ బ్లాక్ మూలకాలు, సమన్వయ సమ్మేళనాలు (d AND f BLOCK ELEMENTS)9)జీవాణువులు (BIOMOLECULES)11)హాలో ఆల్కన్స్ & హాలో ఎరీన్ లు (HALO ALKANES & HALO ARENES)12)C,H,O ఉన్న కర్భన సమ్మేళనాలు & నైట్రోజన్ ఉన్న కర్భన సమ్మేళనాలు (ORGANIC COMPOUNDS CONTAINING C,H and O) & ORGANIC COMPOUNDS CONTAINING NITROGEN).

కోవిడ్ నిబంధనల కారణంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో కూడా రసాయన శాస్త్రము నుండి 30 శాతం మేర సిలబస్ తగ్గించి మిగిలిన చాప్టర్ల నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ( రసాయన శాస్త్రం) లో మొత్తం 11 చాప్టర్స్ ఉంటాయి. వీటిలో 3 చాప్టర్లు లోహ శాస్త్రం (metallurgy), పాలిమర్స్ (polymers) నిత్యజీవితంలో రసాయన శాస్త్రం (chemistry in everyday life)) పూర్తిగా తొలగించబడ్డాయి.

AP Inter 1st year Chemistry Syllabus: ఏపీ ఇంటర్ విద్యార్థులకు గమనిక.. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్ ఇదే..

ఇంటర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రంలో  మొత్తం 60 మార్కులు ఉంటాయి. 21 ప్రశ్నలు ఇవ్వబడతాయి. వీటిలో మొదట 10 ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలుగా ఇవ్వబడతాయి. పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఛాయిస్ ఉండదు. ఇక 4 మార్కుల ప్రశ్నలు 8 ఇస్తారు. ఇందులో ఆరు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. తర్వాత మూడు 8 మార్కుల ప్రశ్నలను ఇస్తారు. ఇందులో రెండింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక ప్రశ్న ఛాయిస్ ఉంటుంది. కొంచెం ప్లాన్డ్ గా, జాగ్రత్తగా చదివితే.. సెకండ్ ఇయర్ కెమెస్ట్రీ లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని, సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ప్లాన్డ్ గా చదవడం, ఆ చదివినదాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం, పరీక్షలో తడబాటు లేకుండా రాయడం కోసం.. చదివిన తర్వాత.. పేపర్ మీద ప్రెజెంట్ చేస్తే మంచిది. ప్రతీదీ ఎగ్జామ్స్ తరహాలో ముందునుండే ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

AP Inter Syllabus: ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు అలర్ట్.. మారిన మాథ్స్ సిలబస్ ఇదే.. ఓ లుక్కేయండి

సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రంలో మొదట 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఛాయిస్ ఉండదు. ఈ పది ప్రశ్నలు మొత్తం అన్ని చాప్టర్స్ నుండి రావొచ్చు. ఉన్న ప్రతి చాప్టర్ నుండి ఒక 2 మార్కుల ప్రశ్న వస్తుంది. అదనంగా పీ-బ్లాక్ మూలకాలు & సమన్వయ సమ్మేళనాలు (P-BLOCK ELEMENTS) నుండి ఒక 2 మార్కుల ప్రశ్న అదనంగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చదివితే.. ఈ పది 2 మార్కుల ప్రశ్నలు ఈజీగా రాయొచ్చని సబ్జెక్ట్ టీచర్లు చెబుతున్నారు.

ఇక 4 మార్కులు ప్రశ్నలు 8 ఇస్తారు. 6 రాయాల్సి ఉంటుంది. రెండు ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుండి ఒక నాలుగు మార్కుల ప్రశ్న వస్తుంది. సెలక్టివ్ గా కొన్ని చాఫ్టర్స్ నుండి చదివితే సరిపోతుందని, 4 మార్కుల ప్రశ్నలు ఆరూ రాసేయవచ్చని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. పరీక్ష కోసం సిలబస్ నుండి తీసేసిన చాప్టర్లు, మిగిలిన చాప్టర్లలో ఒక్క 12వ చాప్టర్ మినహా మిగిలిన 8 చాప్టర్ల నుండి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రతీ చాప్టర్ ను జాగ్రత్తగా చదవాల్సి ఉంది.

ఇందులో మూడు 8 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. రెండు రాయాల్సి ఉంది. ఒక ఛాయిస్ క్వశ్చన్ ఉంటుంది. సిలబస్ లో ఉన్న చాప్టర్స్ లోంచి.. మూడు చాప్టర్స్ నుండే ఈ మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 8 మార్కుల ప్రశ్నలకు సంబంధించి మొదటిది విద్యుత్ రసాయన శాస్త్రము & రసాయన గతి శాస్త్రము (Electro chemistry and Chemical kinetics) చాప్టర్ నుండి వస్తుంది. ఇక రెండవది P-బ్లాక్ మూలకాలు (P-BLOCK ELEMENTS) చాప్టర్ నుండి, మూడవది C,H,O ఉన్న కర్భన సమ్మేళనాలు & నైట్రోజన్ ఉన్న కర్భన సమ్మేళనాలు (ORGANIC COMPOUNDS CONTAINING C,H and O) & ORGANIC COMPOUNDS CONTAINING NITROGEN) చాప్టర్ నుండి వస్తుంది.. వీటిలో మనం 2 ప్రశ్నలకు సమాధానం రాయాలి.

ప్రధానంగా సెకండ్ ఇయర్ ప్రశ్నాపత్రంలో వచ్చే 8 మార్కుల ప్రశ్నల్లో ..  మొదటి మూడు చాప్టర్లు solid state, solutions, electrochemistry and chemical kinetics నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో solutions topic నుంచి నాలుగు మార్కుల ప్రశ్న గాను, electrochemistry and chemical kinetics చాప్టర్ నుండి ఎనిమిది మార్కుల ప్రశ్నలో 4మార్కుల ప్రశ్నగా ఒక ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. పైన చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే కెమిస్ట్రీ లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. All the best.

First published:

Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams

ఉత్తమ కథలు