ANDHRA PRADESH INTER 2ND YEAR SYLLABUS KNOW ABOUT ANDHRA PRADESH INTERMEDIATE 2ND COMMERCE PAPER SYLLABUS DETAILS HERE VSP NS
AP 2nd Year Commerce: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండియర్ కామర్స్ మోడల్ పేపర్ ఇలా..
ప్రతీకాత్మక చిత్రం
ఇంటర్మీడియర్ కామర్స్(COMMERCE) సెకండ్ ఇయర్ లో మొత్తం సిలబస్ ను రెండు భాగాలుగా విభజించారు. ఇందులో ఫస్ట్ పార్ట్ ను పార్ట్-1, సెకండ్ పార్ట్ ను పార్ట్-2 గా పిలుస్తారు.
సేకరణ: ఆనంద్ మోహన్, న్యూస్18 తెలుగు కరస్పాండెంట్, విశాఖపట్నం
ఇంటర్మీడియర్ కామర్స్(COMMERCE) సెకండ్ ఇయర్ లో మొత్తం సిలబస్ ను రెండు భాగాలుగా విభజించారు. ఇందులో ఫస్ట్ పార్ట్ ను పార్ట్-1, సెకండ్ పార్ట్ ను పార్ట్-2 గా పిలుస్తారు. పార్ట్-1 (COMMERCE), part-2 లో అకౌంటెన్సీ(ACCOUNTANCY) గా ఉంటాయి. సెకండ్ ఇయర్ కామర్స్ ప్రశ్నా పత్రం ఈ రెండు విభాగాల నుండి వస్తుంది. ఒక్కొక్క విభాగం 50 మార్కులకు వస్తుంది. మొత్తంగా కామర్స్ సెకండ్ ఇయర్ ప్రశ్నాపత్రం 100 మార్కులకు వస్తుంది. కోవిడ్ కారణంగా కొంత సిలబస్ తగ్గించారు. తగ్గించిన 30 శాతం సిలబస్ తీసేస్తే .. మిగిలిన యూనిట్స్, అందులో అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. పార్ట్ 1లో వచ్చే కామర్స్ (COMMERCE) లో 5 యూనిట్స్ ఉన్నాయి. 1) ఫస్ట్ యూనిట్ గా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ (ENTERPRENEURSHIP DEVELOPMENT) 2)యూనిట్ 2 గా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్( DOMESTIC AND INTERNATIONAL TRADE) 3) యూనిట్ 3 గా బిజినెస్ సర్వీసెస్(BUSINESS SERVICES) 4)యూనిట్ 4గా ఫైనాన్సిషల్ మార్కెట్స్(FINANCIAL MARKETS)
5)యూనిట్ 5 గా కన్యూమర్ ప్రొటెక్షన్(CONSUMER PROTECTION) .. ఇలా 5 యూనిట్స్ ఉంటాయి. ఇక పార్ట్ 2 అయిన అకౌంటెన్సీ (ACCOUNTANCY)లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి.1) యూనిట్-1 గా డెప్రిషియేషన్ అండ్ బిల్ ఆఫ్ ఎక్సేంజ్( DEPRECIATION AND BILL OF EXCHANGE), 2)యూనిట్-2 గా కన్సైన్ మెంట్ అకౌంట్స్ అండ్ అకౌంటింగ్ నాట్ ఫర్ ప్రోఫిట్ ఆర్గనైజేషన్స్(CONSIGNMENT ACCOUNTS AND ACCOUNTING NOT FOR PROFITS ORGANISATIONS) 3)యూనిట్-3 గా పార్ట్ నర్ షిప్ అకౌంట్స్ (PARTNERSHIP ACCOUNTS) 4)యూనిట్ 4 గా కంపెనీ అకౌంట్స్ (COMPANY ACCOUNTS)5)యూనిట్ 5 గా అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్ కంప్లీట్ రికార్డ్స్ (ACCOUNTING FROM INCOMPLETE RECORDS) అనే 5 యూనిట్స్ ఉన్నాయి. ఇక ఈ పార్ట్ అకౌంటెన్సీలో ధియరీ తో పాటు ప్రాబ్లమేటిక్ ప్రశ్నలు వస్తాయి. Inter Exams: తెలంగాణ, ఏపీలో మళ్లీ మారనున్న ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు.. ఎందుకంటే?
కోవిడ్ కారణంగా తొలగించిన సిలబస్ వివరాలు.. పార్ట్2 యూనిట్ 5 నుండి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ (COMPUTARISED ACCOUTING SYSTEM) అనే టాపిక్ ను ఎగ్జామ్ సిలబస్ నుండి తొలగించారు. ఎగ్జామ్ ప్యాట్రన్( exam pattern) చూస్తే..సెకండ్ ఇయర్ కామర్స్ ఎగ్జామ్ పేపర్ ను మూడు విభాగాలుగా విభజించారు. ఎస్పే(ESSAY), ఎస్.ఏ(షార్ట్ ఆన్సర్స్)(SHORT ANSWARS), వి.ఎస్.ఏ(వెరీ షార్ట్ ఆన్సర్స్) (VERY SHORT ANSWERS) గా విభజించారు. ఇందులో ఎస్సే(ESSAY QUESTIONS ఒక్కొక్కటి 10 మార్కులకు, షార్ట్ ఆన్సర్స్(SHORT ANSWARS) ఒక్కొక్కటి 5 మార్కులకు, వెరీ షార్ట్ ఆన్సర్స్ (VERY SHORT ANSWERS) ఒక్కొక్కటి 2 మార్కులకు వస్తాయి. AP Inter First Year English Model Paper: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇంగ్లిష్ మోడల్ పేపర్ ఇదే..
పార్ట్ 1 లో ఉండే 50 మార్కులకు .. ప్రశ్నలు ఇలా ఉంటాయి. సెక్షన్ ఏ లో ఒక్కొక్కటి 10 మార్కుల చొప్పున 2 ఎస్సే(essay) సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మూడు ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఒకటి ఛాయిస్ ఉంటుంది. 40 లైన్లకు తగ్గకుండా 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్-బీ లో షార్ట్ ఆన్సర్స్( short answers) ప్రశ్నలు ఒక్కొక్కటి 5 మార్కుల చొప్పున 20 మార్కులకు 4 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తారు. 20 లైన్లకు తగ్గకుండా సమాధానాలు రాయాలి. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి.
ఇక వెరీ షార్ట్ ఆన్సర్స్(very short answers) 2మార్కుల ప్రశ్నలు 8 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మనం 5 ప్రశ్నలకు సమాధానాలు 5 లైన్లకు తగ్గకుండా రాయాల్సి ఉంటుంది. మూడు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. మొత్తం 50 మార్కులకు సమాధానాలు రాయాలి. సెక్షన్ ఏ 20 మార్కులు, సెక్షన్ బీ 20 మార్కులు, సెక్షన్ సీ లో 10 మార్కులు ఉంటాయి. పార్ట్ 2 లో ఉండే 50 మార్కులకు .. ప్రశ్నలు ఇలా ఉంటాయి. సెక్షన్-డీ లో మొదట ఎస్సే (essay) టైప్ ప్రశ్న ఒకటే 20 మార్కులకు ఇస్తారు. చాయిస్ ఉండదు. ఇక సెక్షన్-ఈ 10 మార్కులకు ఉంటుంది. రెండు ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒకటి చాయిస్ ఉంటుంది. సెక్షన్-ఎఫ్ లో షార్ట్ ఆన్సర్స్ (short answers) 10 మార్కులకు ఉంటుంది.
రెండు 5 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 4 ప్రశ్నలు ఇచ్చి రెండు చాయిస్ ఇస్తారు. ఇక సెక్షన్-జీ లో 10 మార్కులు ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్(very short answers) 2 మార్కుల ప్రశ్నలు 8 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మనం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మూడు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. అంటే పార్ట్ లో సెక్షన్-డీ లో 20 మార్కులు, సెక్షన్-ఈ లో 10 మార్కులు, సెక్షన్-ఎఫ్ లో 10 మార్కులు, సెక్షన్-జీ లో 10 మార్కులు.. మొత్తం కలిపి 50 మార్కులకు సమాధానాలు రాయాలి.
ఇక పార్ట్-1 50 మార్కుల్లో.. యూనిట్స్ వైజ్ గా.. ఏ యూనిట్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయో చూద్దాం.ఫస్ట్ యూనిట్ గా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్( ENTERPRENEURSHIP DEVELOPMENT) నుండి రెండు 5 మార్కుల ప్రశ్నలు, రెండు 2 మార్కుల ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇస్తారు. యూనిట్-2 అయిన డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్( DOMESTIC AND INTERNATIONAL TRADE) నుండి రెండు 5 మార్కుల ప్రశ్నలు, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తుంది. యూనిట్-3 అయిన బిజినెస్ సర్వీసెస్(BUSINESS SERVICES) నుండి ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
ఇక యూనిట్-4 అయిన ఫైనాన్షియల్ మార్కెట్స్(FINANCIAL MARKETS) నుండి ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక చివరి యూనిట్ యూనిట్ 5 అయిన కన్యూమర్ ప్రొటెక్షన్(CONSUMER PROTECTION) నుండి ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. వీటిలో ఛాయిస్ క్వశ్చన్స్ పోనూ 50 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ఇక పార్ట్-2 50 మార్కుల్లో.. యూనిట్స్ వైజ్ గా.. ఏ యూనిట్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయో చూద్దాం. యూనిట్-1 అయిన డెప్రిషియేషన్ అండ్ బిల్ ఆఫ్ ఎక్సేంజ్( DEPRECIATION AND BILL OF EXCHANGE) నుండి రెండు 5 మార్కుల ప్రశ్నలు, రెండు 2 మార్కుల ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇస్తారు.
యూనిట్-2 అయిన కన్సైన్ మెంట్ అకౌంట్స్ అండ్ అకౌంటింగ్ నాట్ ఫర్ ప్రోఫిట్ ఆర్గనైజేషన్స్ (CONSIGNMENT ACCOUNTS AND ACCOUNTING NOT-FOR-PROFITS ORGANISATIONS)నుండి రెండు 10 మార్కుల ప్రశ్నలు, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. యూనిట్-3 అయిన పార్ట్నర్ షిప్ అకౌంట్స్ (PARTNERSHIP ACCOUNTS) నుండి ఒక 20 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక యూనిట్-4 అయిన కంపెనీ అకౌంట్స్ (COMPANY ACCOUNTS) నుండి ఒక 5 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
ఇక చివరి యూనిట్ అయిన అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్ కంప్లీట్ రికార్డ్స్ (ACCOUNTING FROM INCOMPLETE RECORDS) నుండి ఒక 5 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్న వస్తాయి. వీటిలో ఛాయిస్ క్వశ్చన్స్ పోనూ 50 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్ అయిన ఎకౌంటన్సీ నుండి.. భాగస్తుని ప్రవేశం (partnership accounts) నుండి ఒక 20 మార్కుల ప్రశ్న తప్పక వస్తుంది. కాబట్టి ఈ చాప్టర్ ను ఇందులో వచ్చే ప్రాబ్లమ్ గురించి జాగ్రత్తగా చదివితే.. 20 మార్కులు ఈజీగా వస్తాయి.
ఇక అకౌంటెన్సీ నుండే 10 మార్కుల ప్రశ్నలు ప్రాబ్లమ్స్ రూపంలోనూ, 5, 2 మార్కుల ప్రశ్నలు ధియరిటికల్ గా ఉంటాయి. ఏ యూనిట్ నుండి ఎన్ని మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశముందో పైన వివరంగా వివరంగా ఉన్నాయి. కాబట్టి.. వాటిని జాగ్రత్తగా చదవడం, ప్రాక్టీస్ చేయడం చేయగలిగితే.. సెకండ్ ఇయర్ కామర్స్ ఎగ్జామ్ పేపర్ లో సులభంగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఆల్ ది బెస్..
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.