హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter 1st Year Zoology PAPER: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫస్టియర్ జువాలజీ ఎగ్జామ్ సిలబస్ ఇదే

AP Inter 1st Year Zoology PAPER: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫస్టియర్ జువాలజీ ఎగ్జామ్ సిలబస్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ జువాలజీ సిలబస్ లో మొత్తం 8 యూనిట్లు ఉంటాయి. ఇందులో కోవిడ్ కారణంగా 30 శాతం సిలబస్ తగ్గింది. 8 యూనిట్లలో 7వ యూనిట్ ను పూర్తిగా తొలగించిగా, మరికొన్ని యూనిట్లలో ఉన్న కొన్ని టాపిక్స్ ను తొలగించారు.

సేకరణ: భాను ప్రసాద్, న్యూస్18 కరస్పాండెంట్, విజయనగరం

రచయిత: ఏ.గౌరీప్రసాద్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుర్ల

ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ జువాలజీ సిలబస్ లో మొత్తం 8 యూనిట్లు ఉంటాయి. ఇందులో కోవిడ్ కారణంగా 30 శాతం సిలబస్ తగ్గింది. 8 యూనిట్లలో 7వ యూనిట్ ను పూర్తిగా తొలగించిగా, మరికొన్ని యూనిట్లలో ఉన్న కొన్ని టాపిక్స్ ను తొలగించారు. మిగిలిన సిలబస్ నుండి మాత్రమే ప్రశ్నాపత్రం వస్తుంది.

1) జీవ ప్రపంచ వైవిద్యం (జువాలజీ- డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్) (ZOOLOGY- DIVERSITY OF LIVING WORLD). ఇందులో 10 టాపిక్స్ ఉంటాయి. 2) జంతు దేహ నిర్మాణం (స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్)(STRUCTURAL ORGANISATION IN ANIMALS). ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి. 3) జంతు వైవిధ్యం-1 (యానిమల్ డైవర్సిటీ-1: ఇన్వర్టెబ్రేట్ ఫైలా)(ANIMAL DIVERSITY-1:INVERTABRATE PHYLA. ఇందులో 10 టాపిక్స్ ఉంటాయి 4) జంతు వైవిద్యం-2 (యానిమల్ డైవర్సిటీ-2: ఫైలమ్: కోర్డేటా)(ANIMAL DIVERSITY-2: PHYLUM: CHORDATA) ఇందులో 6 టాపిక్స్ ఉంటాయి

5) గమనం, ప్రత్యుత్పత్తి (లోకోమేషన్ అండ్ రీ ప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా) (LOCOMATION & REPRODUCTION IN PROTOZOA). ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి.6) మానవ సంక్షేమంలో జీవశాస్త్రం (బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్) (BIOLOGY & HUMAN WELFARE). ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి.7) పెరిప్లానేటా అమెరికానా(బొద్దింక) (పెరీప్లానేటా అమెరికానా) (periplaneta americana) ఇందులో 9 టాపిక్స్ ఉంటాయి. 8) జీవావరణం-పర్యావరణం (ఎకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్ )(ECOLOGY & ENVIRONMENT) ఇందులో 8 టాపిక్స్ ఉంటాయి.

AP Inter 2nd Year Zoology Syllabus: ఏపీ ఇంటర్ జువాలజీ సిలబస్ ఇదే.. ఎగ్జామ్ లో ఈ ఛాప్టర్ల నుంచే ప్రశ్నలు

ఇలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ లో ఎనిమిది యూనిట్లు ఉంటాయి. వీటిలో కోవిడ్ కారణంగా 7వ యూనిట్ అయిన పెరీప్లానేటా అమెరికానా (periplaneta americana)ను పూర్తిగా తొలగించారు. 8వ యూనిట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్ (ECOLOGY & ENVIRONMENT)లోని నాలుగు సబ్ టాపిక్స్ (అంశాలను) తొలగించారు. ఇలా తగ్గించగా మిగిలిన వాటి నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది. కొంచెం ప్లాన్డ్ గా, జాగ్రత్తగా చదివితే.. ఫస్ట్ ఇయర్ జువాలజీ లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.

AP Inter 2nd year Chemistry: ఏపీ ఇంటర్ సెకండియర్ కెమిస్ట్సీ సిలబస్ ఇదే..

ప్లాన్డ్ గా చదవడం, ఆ చదివినదాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం, పరీక్షలో తడబాటు లేకుండా రాయడం కోసం.. చదివిన తర్వాత.. పేపర్ మీద ప్రెజెంట్ చేస్తే మంచిది. ప్రతీదీ ఎగ్జామ్స్ తరహాలో ముందునుండే ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. జువాలజీ ఫస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రంలో మొత్తం 60 మార్కులు ఉంటాయి. ఇందులో రెండు 8 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంది. మూడు ఇస్తారు. ఒక ఛాయిస్ ఉంటుంది. ఇక ఆరు 4 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 8 ప్రశ్నలు అడుగుతారు. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. పది 2 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పది ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ ఛాయిస్ ఉండదు.

మొదట 8 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఒక ఛాయిస్ క్వశ్చన్ తో పాటు మొత్తం మూడు ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇస్తారు. వీటిలో రెండు రాయాల్సి ఉంది. జాగ్రత్తగా చదివితే ఈ రెండు ప్రశ్నలు రాసేయవచ్చు. ప్రశ్నాపత్నంలో వచ్చే మూడు 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే.. రెండవ యూనిట్ అయిన  జంతు దేహ నిర్మాణం (స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్) (STRUCTURAL ORGANISATION IN ANIMALS) నుండి ఒక 8 మార్కుల ప్రశ్న వస్తుంది. ఇక 6 వ యూనిట్ అయిన  మానవ సంక్షేమంలో జీవశాస్త్రం(బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్) (BIOLOGY & HUMAN WELFARE) నుండి ఒక 8 మార్కుల ప్రశ్న వస్తుంది. ఇక మూడవదిగా 8వ యూనిట్ అయిన జీవావరణం-పర్యావరణం (ఎకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్) (ECOLOGY & ENVIRONMENT) నుండి 8 మార్కుల ప్రశ్న వస్తుంది.

ఇక ప్రశ్నాపత్రంలో 4 మార్కుల ప్రశ్నలు 6 రాయాల్సి ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలు అడుగుతారు. రెండు ఛాయిస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ 4 మార్కుల ప్రశ్నలు.. మొదటి యూనిట్ అయిన జీవ ప్రపంచ వైవిద్యం(జువాలజీ- డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్) (ZOOLOGY- DIVERSITY OF LIVING WORLD), 2వ యూనిట్ అయిన  జంతు దేహ నిర్మాణం (స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్)(STRUCTURAL ORGANISATION IN ANIMALS నుండి, 3వ యూనిట్ అయిన జంతు వైవిధ్యం-1( యానిమల్ డైవర్సిటీ-1: ఇన్వర్టెబ్రేట్ ఫైలా)(ANIMAL DIVERSITY-1:INVERTABRATE PHYLA నుండి, 6వ యూనిట్ అయిన బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ (BIOLOGY & HUMAN WELFARE) నుండి, 8వ యూనిట్ అయిన ఎకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్ (ECOLOGY & ENVIRONMENT) నుండి .. అంటే ఈ నాలుగు యూనిట్ల ఒక్కొక్క 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి.

ఇక 4వ యూనిట్ అయిన యానిమల్ డైవర్సిటీ-2: ఫైలమ్: కోర్డేటా(ANIMAL DIVERSITY-2: PHYLUM: CHORDATA), 5వ యూనిట్ అయిన గమనం, ప్రత్యుత్పత్తి (లోకోమేషన్ అండ్ రీ ప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా)(LOCOMATION & REPRODUCTION IN PROTOZOA) నుండి రెండేసి 4మార్కుల ప్రశ్నలు వస్తాయి. ప్రధానంగా ఈ 4 మార్కుల ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు మాత్రం కొంచెం వైవిద్యంగా అడగవచ్చు. ఏవైనా రెండు అంశాలు ఇచ్చి వాటిమధ్య తేడాలు(డిఫరెన్సెస్) ఏంటి? అని అడగవచ్చు. అలాగే డయాగ్రామ్ లకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.

ఇక రెండు మార్కు ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నాపత్రంలో పది 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. పది కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటిలో ఛాయిస్ ఉండదు.

మొదటి యూనిట్ అయిన (జీవ ప్రపంచ వైవిద్యం )జువాలజీ- డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ (ZOOLOGY- DIVERSITY OF LIVING WORLD) నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు, 2వ యూనిట్ అయిన జంతు దేహ నిర్మాణం (స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్)(STRUCTURAL ORGANISATION IN ANIMALS నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు, 3వ యూనిట్ అయిన  జంతు వైవిధ్యం-1(యానిమల్ డైవర్సిటీ-1: ఇన్వర్టెబ్రేట్ ఫైలా)(ANIMAL DIVERSITY-1:INVERTABRATE PHYLA నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. 5వ యూనిట్ అయిన  గమనం, ప్రత్యుత్పత్తి ( లోకోమేషన్ అండ్ రీ ప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా) (LOCOMATION & REPRODUCTION IN PROTOZOA) నుండి ఒక 2 మార్కుల ప్రశ్న, 6వ యూనిట్ అయిన  మానవ సంక్షేమంలో జీవశాస్త్రం(బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్) (BIOLOGY & HUMAN WELFARE) నుండి ఒక 2 మార్కుల ప్రశ్న, 8వ యూనిట్ అయిన జీవావరణం-పర్యావరణం (ఎకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్) (ECOLOGY & ENVIRONMENT)నుండి ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి.

మొత్తంగా ప్రశ్నాపత్రంలో ఇచ్చే మొత్తం సిలబస్ చూస్తే.. 1వ యూనిట్ నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ చాప్టర్ జాగ్రత్తగా చదివితే.. 8 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇలా రెండవ యూనిట్ లో రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న మొత్తంగా 16 మార్కులు, మూడవ యూనిట్ లో రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న మొత్తంగా 8 మార్కులు, 4వ యూనిట్ లో రెండు 4 మార్కుల ప్రశ్నలు అంటే 8 మార్కులు, ఐదవ యూనిట్ నుండి ఒక 2 మార్కుల ప్రశ్న, రెండు 4 మార్కుల ప్రశ్నలు మొత్తంగా 10 మార్కులు, ఆరవ యూనిట్ నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న అంటే 16 మార్కులు, 8వ యూనిట్ నుండి ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న మొత్తంగా 10 మార్కులు వస్తాయి.

కాబట్టి, 2,5,6,8 వ యూనిట్లను జాగ్రత్తగా చదివితే.. సులభంగా జువాలజీ మొదటి సంవత్సరం పేపరులో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.

First published:

Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams

ఉత్తమ కథలు