Home /News /jobs /

ANDHRA PRADESH INTER 1ST YEAR SYLLABUS KNOW ABOUT ANDHRA PRADESH INTERMEDIATE 1ST YEAR ENGLISH SUBJECT SYLLABUS DETAILS HERE VZM SS

AP Inter 1st Year: ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ సిలబస్ ఇదే

AP Inter 1st Year: ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ సిలబస్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

AP Inter 1st Year: ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ సిలబస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

AP Inter 1st Year English Syllabus | ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఇంటర్ పరీక్షలు (Inter Exams) జరగనున్నాయి. స్టూడెంట్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ తెలుసుకోండి.

    భాను ప్రసాద్ (విజయనగరం)

    ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో ఇంటర్మీయట్ పరీక్షలు (AP Inter Exams) జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్ధులు పూర్తిస్ధాయిలో సిద్దమవుతున్నారు. ఇంటర్మీయట్ లో ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ వంటి అన్ని గ్రూపులకు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కామన్‌గా ఉంటుంది. ఇంటర్ చదివే ప్రతీ విద్యార్ధి మొదటి లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ పరీక్ష రాయాల్సి ఉంది. కాగా, గత ఏడాది కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షల సిలబస్ ను (Inter Exam Syllabus) 30 శాతం మేర తగ్గించింది. ఇంగ్లీష్ టెస్ట్ బుక్స్‌లో మొత్తం సిలబస్ పబ్లిష్ చేసి ఉంటుంది. విద్యార్ధులు కూడా మొత్తం సిలబస్ ను ప్రిపేర్ అయ్యారు. కానీ, కోవిడ్ నేపధ్యంలో ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించడం, సిలబస్ మొత్తం విద్యార్ధులు చదవలేక పోయారన్న కారణం, అలాగే విద్యార్ధులకు పరీక్షల కోసం ప్రిపేర్ కావడం ఇబ్బంది అవుతుందన్న కారణంతో పరీక్షలలో ఇచ్చే ఇంగ్లీష్ సిలబస్ ను 30 శాతం తగ్గించింది.

    EXAM PATTERN


    ఫస్టియర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ లో ఎప్పటిలానే ప్రతీ ఏడాదిలానే 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రోజ్(గద్య భాగం)(PROSE), పోయెట్రీ(పద్య భాగం)(POETRY), నాన్ డిటైల్డ్ (నామవాచకం)(NON DETAILED) 40 మార్కులు, కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్ 10 మార్కులు, గ్రామర్(వ్యాకరణం) 50 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు పేపర్ రాయాల్సి ఉంటుంది.

    విభాగాల వారీగా,ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో ప్రోజ్ (గద్య భాగం) (PROSE), పోయెట్రీ (పద్యభాగం) (POETRY), నాన్ డిటైల్డ్ (నామవాచకం)(NON DETAILED) ఉంటాయి. ఇవి కాక కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్ (COMPREHENSIVE PASSAGES), గ్రామర్ (వ్యాకరణం) (GRAMMER) కూడా ఉంటుంది. వీటి నుండి ప్రతీఏడాది పరీక్షలలో పద్య భాగం, గద్య భాగం, కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్.. మూడూ కలిపి 50 మార్కులకు, వ్యాకరణం (GRAMMER) 50 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. విద్యార్ధులకు ఇంగ్లీష్ భాష అలవడటం కోసం, విద్యార్ధులు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో.. ఒక్క గ్రామర్ నుండి మాత్రమే 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

    పరీక్షలలో వచ్చే ప్రశ్నలు, ఛాయిస్ ల వివరాలు..ఫస్టియర్ ఇంగ్లీష్ పేపర్ లో మొదటి 50 మార్కులకు ప్రోజ్(గద్య భాగం) (PROSE) 16 మార్కులు, పోయెట్రీ(పద్యభాగం) (POETRY) 16 మార్కులు, నాన్ డిటైల్డ్ (నామవాచకం) (NON DETAILED) 8 మార్కులు, కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్ 10 మార్కులు మొత్తంగా 50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

    ఇందులో ప్రోజ్ లో 5 పాఠాలు (లెసన్స్) LESSONS నుండి పరీక్షలో 4 సందర్భ వ్యాక్యాలు (annotations) వస్తాయి. ఇందులో రెండు ఛాయిస్ కాగా, రెండు రాయాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలకు 4 మార్కుల చొప్పున 8 మార్కులు ఉంటాయి. మరో 8 మార్కులకు 2 పేరాగ్రాఫ్ జవాబులు రాయాల్సి ఉంది. వీటిలో ఛాయిస్ ఉండదు. రెండు రాయాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రోజ్ నుండి 16 మార్కులు  ఉంటాయి.

    ఇందులో పోయెట్రీ (POETRY) లో 5 పాఠాలు (లెసన్స్) LESSONS నుండి పరీక్షలో 4 సందర్భ వ్యాక్యాలు (annotations) 8 మార్కులకు వస్తాయి. ఇందులో రెండు ఛాయిస్ కాగా, రెండు రాయాల్సి ఉంటుంది. మరో 8 మార్కులకు 2 పేరాగ్రాఫ్ ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 10 నుండి 15 లైన్ల జవాబులు రాయాలి. ఛాయిస్ ఉండదు. మొత్తంగా పోయెట్రీ నుండి 16 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

    ఇక కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్ (COMPREHENSIVE PASSAGES) 10 మార్కులకు ఇస్తారు. రెండు ప్యాసేజెస్ ఇచ్చి వాటి కింద ప్రశ్నలు ఉంటాయి. వాటికి సరైన జవాబులు రాయాల్సి ఉంది. ఛాయిస్ ఉండదు. నాన్ డిటైల్డ్ (NON DETAILED) నుండి 8 మార్కులు ఉంటాయి. మొత్తం 5 షార్ట్ లెసన్స్ నుండి మూడు ఎస్సై ప్రశ్నలు ఇస్తారు. ఇందులో రెండు ఛాయిస్ కాగా, ఒక దానికి సమాధానం రాయాలి. 25 నుండి 30 లైన్ల మధ్య వ్యాసరూప సమాధానం  రాయాలి. మూడింటిలో ఒక దానికి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇలా మొత్తంగా గద్య, పద్య, నాన్ డిటైల్డ్, కాంప్రెహెన్సివ్ ప్యాసేజెస్ ల నుండి 50 మార్కులకు వివిధ ప్రశ్నలు వస్తాయి.

    ఇక గ్రామర్ ( వ్యాకరణం) నుండి మరో 50 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో  లెటర్ రైటింగ్ 5 మార్కులు, ప్యాసేజెస్, ట్రీ డయాగ్రమ్స్, పైచార్ట్, స్పెల్లింగ్ కరెక్షన్స్, మ్యాచింగ్స్ కాలమ్స్, లెటర్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, ఫుల్ స్టోరీ ఇచ్చి కీ పాయింట్స్ లా నోట్స్ రాయడం, స్ట్రెస్ వర్డ్స్ వంటివి అన్నీ కలిపి 50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

    గత ఏడాది ఛాయిస్ లు ఎక్కువగా ఇవ్వగా, ఈ ఏడాది ఛాయిస్ లను తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్ధులు వీటిని జాగ్రత్తగా గమనించి పరీక్షలకు సన్నద్దం కావాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్.

    ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Disclaimer: పైన ఇచ్చిన వివరాలు విద్యార్థులకు అవగాహన కోసం మాత్రమే. పరీక్షల సిలబస్, మోడల్ పేపర్స్ లాంటి వివరాల కోసం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ఫాలో కావాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AP inter board, AP Inter Exams 2022, Career and Courses, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు