సేకరణ: న్యూస్18 కరస్పాండెంట్, ఆనంద్ మోహన్, విశాఖపట్నం
ఇంటర్మీడియట్ కామర్స్(COMMERCE) ఫస్ట్ ఇయర్ లో మొత్తం సిలబస్ ను రెండు భాగాలుగా విభజించారు. ఇందులో ఫస్ట్ పార్ట్ ను పార్ట్-1, ఫస్ట్ పార్ట్ ను పార్ట్-2 గా పిలుస్తారు. పార్ట్-1 (COMMERCE), part-2 లో అకౌంటెన్సీ(ACCOUNTANCY) గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కామర్స్ ప్రశ్నా పత్రం ఈ రెండు విభాగాల నుండి వస్తుంది. ఒక్కొక్క విభాగం 50 మార్కులకు వస్తుంది. మొత్తంగా కామర్స్ ఫస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రం 100 మార్కులకు వస్తుంది. కోవిడ్ కారణంగా కొంత సిలబస్ తగ్గించారు. తగ్గించిన 30 శాతం సిలబస్ తీసేస్తే .. మిగిలిన యూనిట్స్, అందులో అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. పార్ట్ 1లో వచ్చే కామర్స్ (COMMERCE) లో 5 యూనిట్స్ ఉన్నాయి. 1)యూనిట్ 1లో చాప్టర్1 గా కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్(concept of business, చాప్టర్ 2 గా బిజినెస్ యాక్టివిటీస్ (Business activities) ఉన్నాయి.2)యూనిట్ 2 లో మూడు చాప్టర్లు ఉన్నాయి. చాప్టర్ 3 గా ఫామ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్(forms of business organization), చాప్టర్ 5 గా పార్ట్నర్ షిప్ (partnership) ఉన్నాయి. చాప్టర్ 4 తొలగించబడింది.3)యూనిట్ 3లో చాప్టర్ 6గా జాయింట్ స్టాక్ కంపెనీస్(joint stock companies), చాప్టర్ 7గా ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ(formation of company) ఉన్నాయి. 4)యూనిట్ 4లో చాప్టర్ 8గా సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్1 (sources of business FINANCE-1ఉంది. చాప్టర్ 9 తొలగించబడింది.
5)ఇక యూనిట్ 5లో చాప్టర్ 10 గా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (micro, small and medium enterprises) చాప్టర్ 11గా మల్టీ నేషనల్ కార్పొరేషన్స్ (multi national corporations) చాప్టర్ 12 గా ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ (emerging trends in business) ఉన్నాయి. ఇలా 5 యూనిట్స్ లో పది చాప్టర్లు ఎగ్జామ్ సిలబస్ లో ఉన్నాయి. ఇక ఫస్ట్ ఇయర్ కామర్స్ లోని పార్ట్ 1లో ఉన్న ఈ ఐదు యూనిట్ల నుండి రెండు చాప్టర్లను ఎగ్జామ్ సిలబస్ నుండి తొలగించారు.
Inter Exams: తెలంగాణ, ఏపీలో మళ్లీ మారనున్న ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు.. ఎందుకంటే?
యూనిట్ 2 నుండి జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ (joint hindu family business and co.op.society), యూనిట్ 4 నుండి చాప్టర్ 9గా ఉన్న సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్-2(sources of business finance-2) లను తొలగించారు. ఇక పార్ట్ 2 అయిన అకౌంటెన్సీ (ACCOUNTANCY)లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి.1) యూనిట్-1 లో చాప్టర్ 1 గా బుక్ కీపింగ్ అకౌంటింగ్ (book keeping and accounting), చాప్టర్ 2గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్(accounting principles), చాప్టర్ 3గా డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ (double entry book keeping system ఉన్నాయి. 2)యూనిట్-2 లో చాప్టర్ 4 గా జర్నల్ (journal), చాప్టర్ 5గా లెడ్జెర్ (ledger) ఉన్నాయి.3)యూనిట్-3 లో చాప్టర్ 6గా సబ్సిడరీ బుక్స్ (subsidary books), చాప్టర్ 7 గా జర్నల్ ప్రోపర్ (journal proper), చాప్టర్ 8గా క్యాష్ బుక్ (cash book) ఉన్నాయి.4)యూనిట్ 4 లో చాప్టర్ 9 గా బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ (bank reconciliation statement) ఉన్నాయి.
Ap Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
5) యూనిట్ 5లో చాప్టర్ 10 గా ట్రయిల్ బ్యాలెన్స్(trial balance) మాత్రమే ఉంది. మరో చాప్టర్ తొలగించారు.6) యూనిట్ 6లో చాప్టర్ 12 గా ఫైనల్ అకౌంట్స్ (final accounts) మాత్రమే ఉంది. మరో చాప్టర్ తొలగించారు. ఇక ఈ పార్ట్ లో అకౌంటెన్సీలో అన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఫస్ట్ ఇయర్ కామర్స్ లోని పార్ట్ 2లో ఉన్న ఈ ఆరు యూనిట్ల నుండి రెండు చాప్టర్లను ఎగ్జామ్ సిలబస్ నుండి తొలగించారు. యూనిట్ 5 నుండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ (rectification of errors) చాప్టర్ 11ను, యూనిట్ 6 నుండి చాప్టర్ 13గా ఉన్న ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్ (final accounts with adjustments) లను తొలగించారు.
ఇలా ఫస్ట్ ఇయర్ కామర్స్ లోని రెండు పార్ట్ ల నుండి నాలుగు చాప్టర్ల ను తొలగించి, మిగిలిన సిలబస్ నుండి ఎగ్జామ్ పేపర్ వస్తుంది. ఎగ్జామ్ ప్యాట్రన్( exam pattern) చూస్తే..ఇలా పైన చెప్పబడివన చాప్టర్లనుండి ఫస్ట్ ఇయర్ కామర్స్ ఎగ్జామ్ పేపర్ లో మూడు విభాగాలుగా విభజించి ప్రశ్నలు ఇస్తారు. అవి ఎస్పే(ESSAY), ఎస్.ఏ(షార్ట్ ఆన్సర్స్)(SHORT ANSWARS), వి.ఎస్.ఏ(వెరీ షార్ట్ ఆన్సర్స్) (VERY SHORT ANSWERS) రూపంలో విభజించారు. ఇందులో ఎస్సే(ESSAY QUESTIONS) ఒక్కొక్కటి 10 మార్కులకు, షార్ట్ ఆన్సర్స్(SHORT ANSWARS) ఒక్కొక్కటి 5 మార్కులకు, వెరీ షార్ట్ ఆన్సర్స్ (VERY SHORT ANSWERS) ఒక్కొక్కటి 2 మార్కులకు వస్తాయి.
పార్ట్ 1 లో ఉండే 50 మార్కులకు .. ప్రశ్నలు ఇలా ఉంటాయి. సెక్షన్-ఏ లో మొదట ఎస్సే (essay) టైప్ ప్రశ్నలు 20 మార్కులకు ఇస్తారు. ఇందులో మూడు 10 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. 2 రాయాల్సి ఉంటుంది. సెక్షన్ -బీ లో షార్ట్ ఆన్సర్స్ (short answers) ప్రశ్నలు ఒక్కొక్కటి 5 మార్కులకు ఉంటాయి. 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తారు. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. సెక్షన్-సీ లో వెరీ షార్ట్ ఆన్సర్స్(very short answers) 2 మార్కుల ప్రశ్నలు 8 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మనం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
మూడు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. మొత్తం 50 మార్కులకు సమాధానాలు రాయాలి. పార్ట్ 2 లో ఉండే 50 మార్కులకు .. ప్రశ్నలు ఇలా ఉంటాయి. సెక్షన్-డీ లో మొదట ఎస్సే (essay) టైప్ ప్రశ్న ఒకటే 20 మార్కులకు ఇస్తారు. చాయిస్ ఉండదు. ఇక సెక్షన్-ఈ 10 మార్కులకు ఉంటుంది. రెండు ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒకటి చాయిస్ ఉంటుంది. సెక్షన్-ఎఫ్ లో షార్ట్ ఆన్సర్స్ (short answers) 10 మార్కులకు ఉంటుంది. రెండు 5 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 4 ప్రశ్నలు ఇచ్చి రెండు చాయిస్ ఇస్తారు. ఇక సెక్షన్-జీ లో 10 మార్కులు ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్(very short answers) 2 మార్కుల ప్రశ్నలు 8 ప్రశ్నలు ఇస్తారు.
ఇందులో మనం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మూడు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. అంటే పార్ట్ లో సెక్షన్-డీ లో 20 మార్కులు, సెక్షన్-ఈ లో 10 మార్కులు, సెక్షన్-ఎఫ్ లో 10 మార్కులు, సెక్షన్-జీ లో 10 మార్కులు.. మొత్తం కలిపి 50 మార్కులకు సమాధానాలు రాయాలి. ఇక పార్ట్-1 50 మార్కుల్లో.. యూనిట్స్ వైజ్ గా.. ఏ యూనిట్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయో చూద్దాం.ఫస్ట్ యూనిట్ లోని యూనిట్ 1లోని చాప్టర్1 గా కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్(concept of business, చాప్టర్ 2 గా బిజినెస్ యాక్టివిటీస్ (Business activities)ల నుండి ఒక 5 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక యూనిట్ 2 లో మూడు చాప్టర్లు ఉన్నాయి. చాప్టర్ 3 గా ఫామ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్(forms of business organization), చాప్టర్ 5 గా పార్ట్నర్ షిప్ (partnership) ల నుండి ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
ఇక యూనిట్ 3లో చాప్టర్ 6గా జాయింట్ స్టాక్ కంపెనీస్(joint stock companies), చాప్టర్ 7గా ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ(formation of company)ల నుండి ఒక 10 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. యూనిట్ 4లో చాప్టర్ 8గా ఉన్న సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్1 (sources of business FINANCE-1)నుండి ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. ఇక యూనిట్ 5లో చాప్టర్ 10 గా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (micro, small and medium enterprises) చాప్టర్ 11గా మల్టీ నేషనల్ కార్పొరేషన్స్ (multi national corporations) చాప్టర్ 12 గా ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ (emerging trends in business)ల నుండి మూడు 5 మార్కుల ప్రశ్నలు, మరో 2 మార్కుల ప్రశ్న వస్తాయి.
వీటిలో ఛాయిస్ క్వశ్చన్స్ పోనూ 50 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ఇక పార్ట్-2 50 మార్కుల్లో.. యూనిట్స్ వైజ్ గా.. ఏ యూనిట్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయో చూద్దాం. యూనిట్-1 లో చాప్టర్ 1గా ఉన్న బుక్ కీపింగ్ అకౌంటింగ్ (book keeping and accounting), చాప్టర్ 2గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్(accounting principles), చాప్టర్ 3గా డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ (double entry book keeping system) ల నుండి ఒక 5 మార్కుల ప్రశ్నలు రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. యూనిట్-2 లో చాప్టర్ 4 గా జర్నల్ (journal), చాప్టర్ 5గా లెడ్జెర్ (ledger)ల నుండి ఒక 5 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. యూనిట్-3 లో చాప్టర్ 6గా ఉన్న సబ్సిడరీ బుక్స్ (subsidary books), చాప్టర్ 7 జర్నల్ ప్రోపర్ (journal proper), చాప్టర్ 8గా క్యాష్ బుక్ (cash book)ల నుండి ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
యూనిట్ 4 లో చాప్టర్ 9 గా ఉన్న బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ (bank reconciliation statement) నుండి ఒక 10 మార్కుల ప్రశ్న వస్తుంది. యూనిట్ 5లో చాప్టర్ 10 గా ట్రయిల్ బ్యాలెన్స్(trial balance) నుండి ఒక 5 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తాయి. యూనిట్ 6లో చాప్టర్ 12 గా ఫైనల్ అకౌంట్స్ (final accounts) నుండి ఒక 20 మార్కుల ప్రాబ్లమ్, రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఛాయిస్ క్వశ్చన్స్ పోనూ 50 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ఇక సెకండ్ పార్ట్ అయిన ఎకౌంటన్సీ నుండి.. ఫైనల్ అకౌంట్స్( final accounts) నుండి ఒక 20 మార్కుల ప్రశ్న తప్పక వస్తుంది.
కాబట్టి ఈ చాప్టర్ ను ఇందులో వచ్చే ప్రాబ్లమ్ గురించి జాగ్రత్తగా చదివితే.. 20 మార్కులు ఈజీగా వస్తాయి. అకౌంటెన్సీ లోనే 5 మార్కులు, 2 మార్కుల పప్రశ్నలు ధియరిటీకల్ ప్రశ్నలు వస్తాయి. ఓవరాల్ గా .. పార్ట్ 1 అయిన కామర్స్ లో అత్యధిక మార్కులు వచ్చే, సాధించగలిగే 2, 3, 4, 5 చాప్టర్లపై పట్టు సాధించగలిగితే.. ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఇక పార్ట్ 2 అకౌంటన్సీలోని యూనిట్ 3, 4, 6 లను జాగ్రత్తగా చదివి రాయగలిగితే పార్ట్ 2 నుండి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
ఇక ఏ యూనిట్ నుండి ఎన్ని మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశముందో పైన వివరంగా ఉన్నాయి. కాబట్టి.. వాటిని జాగ్రత్తగా చదవడం, ప్రాక్టీస్ చేయడం చేయగలిగితే.. ఫస్ట్ ఇయర్ కామర్స్ ఎగ్జామ్ పేపర్ లో సులభంగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఆల్ ది బెస్ట్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams