సేకరణ: ఆనంద్ మోహన్, న్యూస్18 కరస్పాండెంట్, విశాఖపట్నం
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) CHEMISTRYలో పరీక్షల కోసం నిర్దేశించిన సిలబస్ లో మొత్తం 13 చాప్టర్స్ ఉంటాయి. ఇవి
1) పరమాణు నిర్మాణం (ATOMIC STRUCTURE)2)మూలకాల వర్గీకరణ (CLASSIFICATION OF ELEMENTS AND PERIODICITY IN PROPERTIES)3)రసాయన బంధం (CHEMICAL BONDING AND MOLECULAR STRUCTURE)4)వాయు స్థితి (STATES OF MATTER: GASES AND LIQUIDS)5)స్టాయికియోమెట్రీ (STOICHIOMETRY)6) ఉష్ణ గతిక శాస్త్రం (THERMODYNAMICS)7)రసాయన సమతా స్థితి & ఆమ్లాలు క్షారాలు (CHEMICAL EQUILIBRIUM AND ACIDS-BASES)8)హైడ్రోజన్ మరియు దాని సమ్మేళనాలు (HYDROGEN AND ITS COMPOUNDS)9) S-బ్లాక్ మూలకాలు (THE S-BIOCK ELEMENTS(ALKALI AND ALKALINE EARTH METALS) GROUP 1 ELEMENTS)10)P బ్లాక్ 13 గ్రూపు మూలకాలు (P-BLOCK ELEMENTS GROUP 13(BORON FAMILY))11)Pబ్లాక్ 14వ గ్రూపు మూలకాలు (P-BLOCK ELEMENTS-GROUP14(CARBON FAMILY))13)కర్భన రసాయన శాస్త్రం (ORGANIC CHEMISTRY- SOME BASIC PRINCIPLES AND TECHNIQUES AND HYDRO CARBONS)
కోవిడ్ కారణంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా రసాయన శాస్త్రము(CHEMISTRY) నుండి 30 శాతం మేర సిలబస్ తగ్గించి మిగిలిన చాప్టర్ల నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం) లో మొత్తం 13 చాప్టర్స్ ఉంటాయి. వీటిలో 12వ చాప్టర్ ENVIRONMENTAL CHEMISTRY పూర్తిగా తొలగించబడింది. ఇది మినహా మిగిలిన చాప్టర్ల నుండి ఎగ్జామ్ పేపర్ వస్తుంది.
ఇంటర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రంలో మొత్తం 60 మార్కులు ఉంటాయి. 21 ప్రశ్నలు ఇవ్వబడతాయి. వీటిలో మొదట 10 ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలుగా ఇవ్వబడతాయి. పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఛాయిస్ ఉండదు. ఇక 4 మార్కుల ప్రశ్నలు 8 ఇస్తారు. ఇందులో ఆరు 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. తర్వాత మూడు 8 మార్కుల ప్రశ్నలను ఇస్తారు. ఇందులో రెండింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక ప్రశ్న ఛాయిస్ ఉంటుంది.
కొంచెం ప్లాన్డ్ గా, జాగ్రత్తగా చదివితే.. ఫస్ట్ ఇయర్ కెమెస్ట్రీ లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని, సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ప్లాన్డ్ గా చదవడం, ఆ చదివినదాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం, పరీక్షలో తడబాటు లేకుండా రాయడం కోసం.. చదివిన తర్వాత.. పేపర్ మీద ప్రెజెంట్ చేస్తే మంచిది. ప్రతీదీ ఎగ్జామ్స్ తరహాలో ముందునుండే ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.
AP SSC Maths Syllabus: ఏపీలో టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. మారిన మాథ్స్ సిలబస్ ఇదే.. ఓ లుక్కేయండి
ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రంలో మొదట 2 మార్కుల ప్రశ్నలు పది ఇస్తారు. పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఛాయిస్ ఉండదు. ఈ పది ప్రశ్నలు ఉన్న 12 చాప్టర్లలో 8 చాప్టర్ల నుండి వస్తాయి. మూడవ చాప్టర్ నుండి 8వ చాప్టర్ వరకూ.. ఈ 6 చాప్టర్ల నుండి ఒక్కొక్క 2 మార్కుల ప్రశ్న వస్తుంది. ఇక 9వ చాప్టర్ , 10వ చాప్టర్ల నుండి రెండేసి 2 మార్కుల చొప్పున మొత్తం 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. అంటే అదనంగా 9వ చాప్టర్ పీ-బ్లాక్ మూలకాలు & సమన్వయ సమ్మేళనాలు (THE s-BLOCK ELEMENTS)(ALKALI AND ALKALINE), 10వ చాప్టర్ పీ బ్లాక్ మూలకాలు( P-BLOCK ELEMENTS GROUP 13) ల నుండి రెండేసి 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చదివితే.. ఈ పది 2 మార్కుల ప్రశ్నలు ఈజీగా రాయొచ్చని సబ్జెక్ట్ టీచర్లు చెబుతున్నారు.
ఇక 4 మార్కులు ప్రశ్నలు ఎనిమిది ఇస్తారు. ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండు ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుండి ఒక నాలుగు మార్కుల ప్రశ్న వస్తుంది. సెలక్టివ్ గా కొన్ని చాఫ్టర్స్ నుండి చదివితే సరిపోతుందని, 4 మార్కుల ప్రశ్నలు ఆరూ రాసేయవచ్చని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. 3వ చాప్టర్ నుండి 8 వ చాప్టర్ వరకూ.. ఈ ఆరు చాప్టర్ ల నుండి ఆరు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక 11 వ చాప్టర్, 13 వ చాప్టర్ ల నుండి ఒక్కొక్క 4 మార్కుల ప్రశ్న వస్తుంది. అంటే 3,4,5,6,7,8,11,13 చాప్టర్ల నుండి ఒక్కొక్క 4 మార్కుల ప్రశ్న వస్తుంది.
ఇక 8 మార్కులకు సంబంధించి మూడు 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండు రాయాల్సి ఉంది. ఒక ఛాయిస్ క్వశ్చన్ ఉంటుంది. సిలబస్ లో ఉన్న చాప్టర్స్ లోంచి.. మూడు చాప్టర్స్ నుండే ఈ మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 8 మార్కుల ప్రశ్నలకు సంబంధించి మొదటి చాప్టర్ అయిన 1) పరమాణు నిర్మాణం (ATOMIC STRUCTURE) చాప్టర్ నుండి వస్తుంది. ఇక రెండవది 2వ చాప్టర్ అయిన మూలకాల వర్గీకరణ (CLASSIFICATION OF ELEMENTS AND PERIODICITY IN PROPERTIES) చాప్టర్ నుండి వస్తుంది. ఇక మూడవది 13 వ చాప్టర్ అయిన కర్భన రసాయన శాస్త్రం (ORGANIC CHEMISTRY- SOME BASIC PRINCIPLES AND TECHNIQUES AND HYDRO CARBONS) చాప్టర్ నుండి వస్తుంది. వీటిలో మనం 2 ప్రశ్నలకు సమాధానం రాయాలి
ముఖ్యంగా ఎగ్జామ్ పేపర్ ద్ళష్టిలో పెట్టుకొని.. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రంలో సిలబస్ లో ఉన్న మొదటి 2 చాప్టర్లు, 13 వ చాప్టర్ అయిన కర్భన రసాయన శాస్త్రం( ORGANIC CHEMISTRY) చాలా ముఖ్యమైనవి. వీటి నుండే 8 మార్కుల ప్రశ్నలు మూడు రావొచ్చు. ఇలా పైన చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే కెమిస్ట్రీ లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది.
ఇక ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమనే అవకాశం ఉంది. 4వ చాప్టర్ అయిన వాయు స్థితి (STATES OF MATTER: GASES AND LIQUIDS) నుండి ఒక 2 మార్కుల ప్రాబ్లమ్, 5వ చాప్టర్ అయిన స్టయికియోమెట్రీ (STOICHIOMETRY) నుంచి ఒక 4 మార్కుల ప్రాబ్లమ్, ఒక 2 మార్కుల ప్రాబ్లమ్ రావొచ్చు. ఒక మరో ప్రాబ్లమ్ 7వ చాప్టర్ అయిన రసాయన సమతా స్థితి & ఆమ్లాలు క్షారాలు (CHEMICAL EQUILIBRIUM AND ACIDS-BASES) నుండి ఒక 2 మార్కుల ప్రశ్న రావొచ్చు.
ఎగ్జామ్ పేపర్ ను 70 శాతం సిలబస్ నుండే ఇస్తారు కాబట్టి, ఉన్న సిలబస్ లో అన్ని ముఖ్యమైన (IMPORTANT) ప్రశ్నలు చదివి గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ స్టూడెంట్ ని ద్ళష్టిలో పెట్టుకొని కూడా పేపరు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతీ విద్యార్ది మంచి మార్కులు సాధించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams