Home /News /jobs /

ANDHRA PRADESH INTER 1ST YEAR SYLLABUS KNOW ABOUT ANDHRA PRADESH INTER 1ST YEAR PHYSICS PAPER DETAILS HERE VSP NS

AP Inter 1st Year Physics: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఫిజిక్స్ మోడల్ పేపర్ ఇదే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ కారణంగా గత ఏడాది ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ లో కొంత సిలబస్ తగ్గించడం జరిగింది. ఈ ఏడాది కొన్ని చాప్టర్ల లో 30 శాతం మేర అంశాలను తగ్గించి, మిగిలిన చాప్టర్స్ లోని అంశాల నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇచ్చే అవకాశం ఉంది.

    సేకరణ: ఆనంద్ మోహన్, న్యూస్18 కరస్పాండెంట్, విశాఖపట్నం
    ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్( భౌతిక శాస్త్రం) PHYSICS లో మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి. ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, ఆసులేషన్స్, మెకాలికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకాలికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థెర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, థెర్మో డైనమిక్స్, కైనెటిక్ ధీరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్లు ఉన్నాయి. వీటిలో మొత్తం అన్ని చాప్టర్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.  కోవిడ్ కారణంగా గత ఏడాది ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ లో కొంత సిలబస్ తగ్గించడం జరిగింది. ఈ ఏడాది కొన్ని చాప్టర్ల లో 30 శాతం మేర అంశాలను తగ్గించి, మిగిలిన చాప్టర్స్ లోని అంశాల నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇచ్చే అవకాశం ఉంది.

    తగ్గించిన సిలబస్ వివరాలు
    కొంచెం ప్లాన్డ్ గా, జాగ్రత్తగా చదివితే.. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ప్లాన్డ్ గా చదవడం, ఆ చదివినదాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం, పరీక్షలో తడబాటు లేకుండా రాయడం కోసం.. చదివిన తర్వాత.. పేపర్ మీద ప్రెజెంట్ చేస్తే మంచిది. ప్రతీదీ ఎగ్జామ్స్ తరహాలో ముందునుండే ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో మొత్తం 60 మార్కులు ఉంటాయి. ఇందులో మూడు 8 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు, ఎనిమిది 4 మార్కుల ప్రశ్నలు, 10 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
    AP 2nd Year Physics: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఫిజిక్స్ పేపర్ ఇలా.. ఓ లుక్కేయండి

    మొదట 8 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఒక ఛాయిస్ క్వశ్చన్ తో పాటు మొత్తం మూడు ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇస్తారు. వీటిలో రెండు రాయాల్సి ఉంది. జాగ్రత్తగా చదివితే ఈ రెండు ప్రశ్నలు రాసేయవచ్చు. ప్రధానంగా ఫస్ట్ ఇయర్ సిలబస్ లో ఉన్న 14 చాప్టర్స్ లో మూడు చాప్టర్స్ నుండే ఈ మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వర్క్ ఎనర్జీ పవర్ అనే ముఖ్యమైన చాప్టర్ నుండి మొత్తం మూడు 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ మూడు ప్రశ్నలు జాగ్రత్తగా చదివి గుర్తు పెట్టుకుంటే.. ఒక 8 మార్కుల ప్రశ్న రాసేయవచ్చు. ఈ 8 మార్కుల ప్రశ్నలో రెండు ప్రశ్నలు వస్తాయి. ఒక 6 మార్క్స్ ధియరీ ప్రశ్న, ఒక ప్రాబ్లమ్ రెండు మార్కులది ఉండొచ్చు.
    AP Inter Chemistry 1st Year Model Paper: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. కెమిస్ట్రీ మోడల్ పేపర్ ఇదే

    ఇక రెండవ 8 మార్కుల ప్రశ్న ఆసులేషన్స్ అనే చాప్టర్ నుండి వస్తుంది. ఈ చాప్టర్ లో కూడా మూడు ప్రశ్నలు ఉంటాయి. మూడూ చదివితే ఒక రెండవ 8 మార్కుల ప్రశ్న రాసేయవచ్చు. ఇందులో కూడా రెండు ప్రశ్నలు వస్తాయి. ఒక 6 మార్క్స్ ధియరీ, ఒక ప్రాబ్లమ్ రెండు మార్కులది ఉండొచ్చు. ఇక మరో ముఖ్యమైన చాప్టర్ థెర్మో డైనమిక్స్ లో ఒకటే 8 మార్కుల ప్రశ్న ఉంటుంది. అది చదివితే 8 మార్కుల ప్రశ్న ఆన్సర్ చెయ్యెచ్చు.

    ఇక ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ లో 4 మార్కులు ప్రశ్నలు ఆరు రాయాల్సి ఉంటుంది. 8 ప్రశ్నలు ఇస్తారు. రెండు ఛాయిస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చదివితే.. 6 ప్రశ్నలు రాయొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ సిలబస్ లో ఉన్న 14 చాప్టర్స్ లో 7 చాప్టర్ల  నుండే ఈ ఎనిమిది ప్రశ్నలు వస్తాయి. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ చాప్టర్ నుండి ఒక ప్రశ్న ప్రాబ్లమ్ రూపంలో ఇవ్వొచ్చు. ఇక మోషన్ ఇన్ ప్లేన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్ నుండి రెండు ప్రశ్నలు, గ్రావిటేషన్, థెర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఈ ఆరు చాప్టర్స్ నుండి మిగిలిన ఏడు ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ చాప్టర్స్ చదివితే... 6 ప్రశ్నలు సులభంగా రాసేయోచ్చు.

    ఇక చివరిగా పేపర్ లో 2 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. పది ప్రశ్నలకు గానూ పది ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఛాయిస్ ఉండదు. ఇక చాప్టర్ల విషయానికి వస్తే.. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుండి 2 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక ప్రాబ్లమ్, ఒక ధియరీ ప్రశ్న ఉంటాయి. మరో చాప్టర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుండి కూడా 2 ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక ప్రాబ్లమ్, ఒక ధియరీ ప్రశ్న ఉంటాయి.


    ఇక మిగిలిన చాప్టర్లు అయిన ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్,  మోషన్ ఇన్ ఏ ప్లేన్ ,  న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, థెర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్ చాప్టర్ల నుండి, ఒక్కొక్క 2 మార్కుల ప్రశ్నలు రావొచ్చు. మొత్తంగా కేర్ ఫుల్ గా చదివితే.. ప్రతీ చాప్టర్ నుండి ఏ ప్రశ్న రావొచ్చన్నది ఈజీగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. చదవడం, చదివినదాన్ని పేపర్ పై పెట్టడం మంచిది. ఇక ధియరీ ప్రశ్నలే కాక ప్రాబ్లమ్స్ కూడా ఫిజిక్స్ లో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు