హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh High Court Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 111 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 111 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 20 చివరి తేదీ. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి. దరఖాస్తు ఫామ్‌ను http://hc.ap.nic.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ http://hc.ap.nic.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ సెక్షన్‌లో చూడొచ్చు.

Andhra Pradesh High Court Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 111

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 20 సాయంత్రం 5 గంటలు

ఎంపిక విధానం- విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూ.

విద్యార్హత- ఆఫీస్ సబార్డినేట్‌ పోస్టుకు 7వ తరగతి పాస్ కావాలి. టెన్త్ ఫెయిల్ అయినవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. డ్రైవర్ పోస్టుకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ లేదా ఉర్దూ చదవాలి. రాయాలి.

వయస్సు- 18 నుంచి 34 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.

అప్లికేషన్ ఫీజు- రూ.250. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు రూ.100.

వేతనం- ఆఫీస్ సబార్డినేట్‌కు రూ.13,000-రూ.40,270. డ్రైవర్‌కు రూ.15,460-రూ.47,330.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Registrar (Administration),

High Court Of Andhra Pradesh,

Nelapadu, Amaravati,

Guntur District - 522 237.

ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

CBSE CTET 2020: టీచర్లకు గుడ్ న్యూస్... ఈ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలకు ఛాన్స్

Andhra Pradesh Jobs: సచివాలయ ఉద్యోగాలకు అప్లై చేయనివారికి మరో ఛాన్స్

Railway Jobs: రైల్వేలో మరో 2792 ఖాళీలకు నోటిఫికేషన్... వివరాలివే

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Andhrapradesh, AP High Court, AP News, CAREER, Exams, High Court, Highcourt, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu varthalu

ఉత్తమ కథలు