HOME »NEWS »JOBS & EDUCATION »andhra pradesh health medical and family welfare department job notification for 1113 mid level health provider posts ss

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్... అప్లికేషన్ లింక్ ఇదే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్... అప్లికేషన్ లింక్ ఇదే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్... అప్లికేషన్ లింక్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Mid Level Health Provider Recruitment 2019 | కోర్సు విజయవంతంగా పూర్తి చేసినతర్వాత విధుల్లోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు బ్రిడ్జ్ కోర్స్ ఫీజు, వసతి, స్టడీమెటీరియల్, కౌన్సెలింగ్ ఖర్చుల్ని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అందిస్తుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వేర్వేరు డిపార్ట్‌మెంట్లు ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల నియామకం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 1113 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల్ని ప్రకటించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులివి. ఎంపికైనవారు హెల్త్, వెల్‌నెస్ సెంటర్లలో ఏడాదిపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారిని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU అందించే 'బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్' సర్టిఫికెట్ కోర్స్‌లో జాయిన్ చేస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసినతర్వాత విధుల్లోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు బ్రిడ్జ్ కోర్స్ ఫీజు, వసతి, స్టడీమెటీరియల్, కౌన్సెలింగ్ ఖర్చుల్ని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అందిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 29 చివరి తేదీ.

    Andhra Pradesh Mid Level Health Provider Recruitment 2019: నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే...


    మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీలు- 1113


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 16
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 29
    హాల్‌టికెట్ల జారీ- 2019 డిసెంబర్ 5
    కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2019 డిసెంబర్ 10 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలు
    బ్రిడ్జ్ కోర్స్ ప్రారంభం- 2019 డిసెంబర్ 23
    విద్యార్హత- బీఎస్‌సీ నర్సింగ్ పాసైనవారు అర్హులు.
    వయస్సు- 35 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 ఏళ్లు.
    వేతనం- శిక్షణ సమయంలో ఎలాంటి స్టైపెండ్ ఉండదు. శిక్షణ పూర్తైన తర్వాత నెలకు రూ.25,000.
    దరఖాస్తు ఫీజు- రూ.300. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫీజు లేదు.
    ఎంపిక ప్రక్రియ- ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే

    SAIL Recruitment 2019: స్టీల్ అథారిటీలో 148 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Jobs: హైదరాబాద్ పరిధిలో సైట్ ఇంజనీర్ల నియామకం... నోటిఫికేషన్ వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:November 20, 2019, 10:43 IST