హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మిత్ర పోస్టులకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మిత్ర పోస్టులకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మిత్ర పోస్టులకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Jobs 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య మిత్ర పోస్టులకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Jobs 2021 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 34 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://guntur.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  Andhra Pradesh Jobs 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 34

  ఆరోగ్య మిత్ర- 27

  టీమ్ లీడర్- 4

  డేటా ఎంట్రీ ఆపరేటర్- 3

  SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలకు త్వరలో పరీక్ష... ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇదే

  Teacher Jobs 2021: మొత్తం 5,807 టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం

  Andhra Pradesh Jobs 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 6

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 9 సాయంత్రం 5 గంటలు

  విద్యార్హతలు- ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ, బీఎస్‌సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పాస్ కావాలి. టీమ్ లీడర్ పోస్టుకు హాస్పిటల్ సర్వీస్‌లో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు కంప్యూటర్స్‌లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. పీజీడీసీఏ, సీఏడీ, ఇతర కంప్యూటర్ కోర్స్ పాస్ కావాలి.

  వేతనం- ఆరోగ్య మిత్ర పోస్టుకు రూ.12,000, టీమ్ లీడర్ పోస్టుకు రూ.15,000, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.15,000.

  Coal India Recruitment 2021: కోల్ ఇండియాలో 1086 ఉద్యోగాలు... ఏడో తరగతి పాస్ అయితే చాలు

  BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  Andhra Pradesh Jobs 2021: దరఖాస్తు విధానం


  అభ్యర్థులు https://guntur.ap.gov.in/ ఓపెన్ చేయాలి.

  హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్స్ క్లిక్ చేయాలి.

  ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఉంటాయి.

  నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ లింక్ వేరుగా ఉంటుంది.

  నోటిఫికేషన్ చదివి, విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి.

  దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

  దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

  Aarogyasri District Coordinator Office,

  Guntur: A/26, Type-4, R&B Quarters,

  Beside DMHO Office,

  Collector Bunglow Road,

  Guntur-522004.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu, Upcoming jobs

  ఉత్తమ కథలు