AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1036 గ్రామ, వార్డు వాలంటీర్ ఉద్యోగాలు

Andhra Pradesh Grama Ward Volunteer Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 31, 2020, 3:20 PM IST
AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1036 గ్రామ, వార్డు వాలంటీర్ ఉద్యోగాలు
AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1036 గ్రామ, వార్డు వాలంటీర్ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరోసారి గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే 16,208 సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలున్నాయి. ఇవి కాకుండా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1036 గ్రామ, వార్డ్ వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వేర్వేరు జిల్లాలకు చివరి తేదీ వేర్వేరుగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 350 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో 200 పోస్టులు

Paytm Jobs: పేటీఎంలో 1,000 పైగా జాబ్స్... వీరికే అవకాశం

AP Grama Ward Volunteer Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 1036
నెల్లూరు- 273
చిత్తూరు- 374శ్రీకాకుళం- 85
తూర్పు గోదావరి- 65
గుంటూరు- 239

AP Grama Ward Volunteer Recruitment 2020: దరఖాస్తు తేదీలు


శ్రీకాకుళం- 2020 ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు
తూర్పు గోదావరి- 2020 ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు
గుంటూరు- 2020 సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు
నెల్లూరు- 2020 ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు
చిత్తూరు- 2020 ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

AP Grama Ward Volunteer Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి.
వయస్సు- 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం- ఎంపికైన వారికి రూ.5,000 గౌరవ వేతనం.
Published by: Santhosh Kumar S
First published: August 31, 2020, 3:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading