ANDHRA PRADESH GRAMA VOLUNTEER RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 48 VACANCIES IN VIZIANAGARAM DISTRICT LAST DATE FOR TO APPLY IS APRIL 22 NS
Andhra Pradesh Jobs: ఏపీలోని ఆ జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి
వాలంటీర్లు (ఫైల్ ఫొటో)
ANDHRA PRADESH GRAMA VOLUNTEER RECRUITMENT 2021: ఏపీలోని మరో జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ నెల 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న 48 వాలంటీర్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు ప్రభుత్వ పథకాలు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇంకా వయస్సు విషయానికి వస్తే ఈ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారి కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 35 ఏళ్లు ఉండాలి. DRDO Apprentice Recruitment 2021: డీఆర్డీఓలో అప్రంటీస్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ఆధారంగానే ఎంపిక..
దరఖాస్తు, ఎంపిక విధానం..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటి లోగా అంటే ఈ నెల 22లోగా ఆన్ లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ gswsvolunteer.apcfss.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పథకాలపై అభ్యర్థులకు ఉన్న అవగాహన, అనుభవం, నాయకత్వ లక్షణాలు, ఇతర నైపుణ్యాలకు ఒక్కో దానికి 25 చొప్పున కేటాయించి జిల్లా సెలక్షన్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.