ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పలు పథకాలను ప్రజల ఇంటి దగ్గరకు చేర్చేందుకే జగన్ సర్కార్ గ్రామవాలంటీర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేల సంఖ్యలో గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. ఏర్పడుతున్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది ఏపీ ప్రభుత్వం. టెన్త్ అర్హత ఉండి స్థానికంగానే నివాసం ఉంటున్న అభ్యర్థులకు వాలంటీర్ ఉద్యోగం మంచి అవకాశమనే చెప్పవచ్చు. తాజాగా రాష్ట్రంలో మరోసారి వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో మొత్తం 389 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు చెందిన స్థానికులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
రాజాంలో 4, పలాస-కాశీబుగ్గలో 12, ఇచ్ఛాపురంలో 9, ఆమదాలవలసలో 11, పొందూరులో 13, నరసన్నపేటలో 14తో పాటు ఇతర గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఖాళీలు ఉన్నాయి. ఆ పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు. అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి. వయస్సు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. స్థానికులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ప్రభుత్వ పథకాలపై అవగాహన తప్పనిసరి. ఎంపికైన వారికి రూ.5,000 గౌరవ వేతనం లభిస్తుంది.
అప్లై చేసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లోని ఖాళీలకు ఈ నెల 26, మరి కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీల్లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా సెలక్షన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gram volunteer, Ward Volunteers