ANDHRA PRADESH GRAMA VOLUNTEER RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 337 VOLUNTEER POSTS IN VIZAG DISTRICT NS
Andhra Pradesh Jobs: ఏపీలో భారీగా వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్.. ఖాళీల వివరాలివే..
వాలంటీర్లు (ఫైల్ ఫొటో)
Andhra Pradesh Grama/Ward Sachivalayam Volunteers Recruitment 2021: ఏపీలో మరో సారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజలకు ప్రభుత్వ పథకాలను అత్యంత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. ఎక్కడైనా వాలంటీర్ ఉద్యోగాల్లో ఖాళీలు ఏర్పడితే వెంటనే వాటిని అధికారులు భర్తీ చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలో వాలంటీర్ ఉద్యోగల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. మొత్తం 337 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకనటలో పేర్కొన్నారు. ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని స్థానిక అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14లోగా అప్లై చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు..
మామిడివాడ, మాడుగుల, వద్రపల్లి, చక్కపల్లి, లింగాపురం, కొత్తపల్లి, అచ్యుతాపురం, గండవరం, రెడ్డిపల్లి తదితర పంచాయతీల్లో మూడు చొప్పున ఖాళీలు ఉన్నాయి. పెదగుమ్మలూరు, సత్యనారాయణపురం, పలమామిడి, తల్లవలస, రాచపల్లి పంచాయతీల్లో నాలుగు చొప్పున ఖాళీలు ఉన్నాయి. కొర్రాయి, పంద్రంగిలో ఐదు చొప్పున, చోడవరంలో 25, కశింకోటలో 11 ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇతర గ్రామాల్లో ఒకటి లేదా రెండు చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతల వివరాలు..
వాలంటీర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలి. ఈ పథకాలను ప్రజలకు వివరించే సామర్థ్యం ఉండాలి. తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే..
అభ్యర్థులు మొదటగా gswsvolunteer.apcfss.in వెబ్ సైట్ ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలి. అప్లికేషన్ నింపే సమయంలో పదో తరగతి సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సంతకం చేసిన ఫొటో కూడా జత చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తును సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ ను తెలుసుకోవచ్చు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.