Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Andhra Pradesh Gramasachivalayam Wardsachivalayam Recruitment Notification | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2019 ఆగస్ట్ 15 చివరి తేదీ.

news18-telugu
Updated: July 30, 2019, 4:56 PM IST
Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. భారీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 పోస్టుల్ని భర్తీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే 11,114 గ్రామ సచివాలయాల్లో 13 విభాగాల్లో, 3,786 వార్డు సచివాలయాల్లో 9 విభాగాల్లో వేర్వేరు పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏపీ సర్కార్. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే రాత పరీక్ష నిర్వహించి సెప్టెంబర్ నెలాఖరునాటికి ఉద్యోగులను నియమించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అక్టోబర్ 2న విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటోంది. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ-DSC ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే సర్వీసులో ఉన్నవారికి 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ఎంపికైనవారికి రెండేళ్ల ప్రొబెషనరీ పీరియడ్, నెలకు రూ.15,000 వేతనం ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాల నోటిఫికేషన్ వివరాలివే...



గ్రామ సచివాలయ పోస్టులు: 95,088
1. పంచాయతీ సెక్రెటరీ డిజిటల్ అసిస్టెంట్: 11,158
2. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్: 11,158
3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్: 11,158
4. విలేజ్ సర్వేయర్- గ్రేడ్ 3: 11,1585. ఇంజనీరింగ్ అసిస్టెంట్- గ్రేడ్ 2: 11,158
6. యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్: 9886
7. ఏఎన్ఎం- గ్రేడ్ 3- 9754
8. పంచాయతీ సెక్రెటరీ- గ్రేడ్ 5: 7040
9. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్-గ్రేడ్ 2: 6714
10. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్: 4000
11. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్: 794
12. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్: 710
13. విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్: 400

వార్డు సచివాలయ పోస్టులు: 33,051
1. ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి: 3786
2. ఏఎన్ఎం-వార్డు ఆరోగ్య కార్యదర్శి- 3786
3. సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి-గ్రేడ్ 2: 3786
4. మహిళా, బలహీన వర్గాల పరిరక్షణ కార్యదర్శి- 3786
5. ప్రణాళిక, క్రమబద్ధీకరణ కార్యదర్శి-గ్రేడ్ 2: 3770
6. పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి-గ్రేడ్ 2: 3648
7. సౌకర్యాల కల్పన కార్యదర్శి: 3601
8. వార్డు పరిపాలన కార్యదర్శి: 3307
9. వార్డు రెవెన్యూ కార్యదర్శి- 2170
విద్యుత్ కార్యదర్శి-గ్రేడ్ 2: 1861

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2019 ఆగస్ట్ 15 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. కనీసం 12వ తరగతి వారికి కూడా పోస్టులున్నాయి. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. వార్డు, గ్రామ సచివాలయాల్లో వేర్వేరు విభాగాల్లో పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IRCTC Jobs: ఐఆర్‌సీటీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... ప్రారంభమైన రిజిస్ట్రేషన్

Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: July 29, 2019, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading