AP grama sachivalayam Results: ఏపీ గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా

AP grama sachivalayam Results | 21,69,814 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వారంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు విడుదలయ్యాయి.

news18-telugu
Updated: September 19, 2019, 1:28 PM IST
AP grama sachivalayam Results: ఏపీ గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
  • Share this:
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు శుభవార్త. గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 1,26,728 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 21,69,814 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వారంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు విడుదలయ్యాయి.

AP grama sachivalayam Results: చెక్ చేసుకోండి ఇలా



ముందుగా gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో పరీక్షా ఫలితాల లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కొత్త పేజీలో హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు కనిపిస్తాయి.
ఫలితాలను ప్రింట్ తీసుకొని కాపీని భద్రపర్చుకోవాలి.Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

LIC Jobs: ఎల్ఐసీలో 8500 అసిస్టెంట్ ఉద్యోగాలకు సిలబస్ ఇదే...

RITES Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: September 19, 2019, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading