AP grama sachivalayam Results: గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి... నెక్స్ట్ ఏంటీ?

AP grama sachivalayam Results | ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడేం చేయాలన్న సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి.

news18-telugu
Updated: September 19, 2019, 2:59 PM IST
AP grama sachivalayam Results: గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి... నెక్స్ట్ ఏంటీ?
AP grama sachivalayam Results: ఏపీ గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి... నెక్స్ట్ ఏంటీ? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. ప్రతీ సచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను నియమించడమే లక్ష్యంగా మొత్తం 1,26,728 పోస్టుల భర్తీ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 11.158 గ్రామ సచివాలయాల్లో 95,088 పోస్టుల్ని, 3786 వార్డు సచివాలయాల్లో 36,410 పోస్టుల్ని కేటాయించింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 19.50 లక్షల మంది పరీక్ష రాశారు. వాటి ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఒకే నోటిఫికేషన్‌తో 1,26,728 ఉద్యోగాలు కల్పించి రికార్డ్ సృష్టించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రికార్డ్ సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేసినందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. ఒకేసారి ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం రికార్డని, ఎన్నికల హామీలో చెప్పినట్టు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పరీక్షల్లో విజయం సాధించినవారికి అభినందనలు తెలిపారు. మొత్తం 1,98,164 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో పురుషులు 1,31,327 కాగా, స్త్రీలు 66,835. గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలను ఈ కింది వెబ్‌సైట్లల్లో చెక్ చేసుకోవచ్చు.

http://gramasachivalayam.ap.gov.in/
http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/
https://www.rtgs.ap.gov.in/



ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడేం చేయాలన్న సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం చెప్పిన ప్రదేశానికి వెళ్లి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారు అవగాహన కార్యక్రమానికి హాజరైన తర్వాత విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాల్లో అర్హత సాధించినవారంతా గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే.

వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల అప్‌లోడ్: 2019 సెప్టెంబర్ 21 నుంచికాల్ లెటర్ల పంపిణీ: 2019 సెప్టెంబర్ 21, 22
సర్టిఫికెట్ వెరిఫికేషన్: 2019 సెప్టెంబర్ 23 నుంచి 25
నియామక ఉత్తర్వుల జారీ: 2019 సెప్టెంబర్ 27
అవగాహన కార్యక్రమం: 2019 అక్టోబర్ 1, 2
విధుల్లో చేరాల్సిన తేదీ: 2019 అక్టోబర్ 2

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

LIC Jobs: ఎల్ఐసీలో 8500 అసిస్టెంట్ ఉద్యోగాలకు సిలబస్ ఇదే...

Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>