AP Grama Sachivalayam Hall Ticket: గ్రామ సచివాలయ పరీక్షలకు హాల్ టికెట్ల విడుదల

AP Grama Sachivalayam Hall Ticket | 21 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2019 సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి.

news18-telugu
Updated: August 26, 2019, 2:36 PM IST
AP Grama Sachivalayam Hall Ticket: గ్రామ సచివాలయ పరీక్షలకు హాల్ టికెట్ల విడుదల
AP Grama Sachivalayam Hall Ticket: గ్రామ సచివాలయ పరీక్షలకు హాల్ టికెట్ల విడుదల (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారికి శుభవార్త. గ్రామ సచివాలయ పరీక్షల హాల్ టికెట్స్ విడుదలౌతున్నాయి. gramsachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో కేటగిరీ 1, కేటగిరీ 3 పరీక్షల హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగతా పరీక్షలకు కూడా త్వరలో హాల్ టికెట్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. గ్రామ సచివాలయాల్లో 1.6 లక్షలకు పైగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ పోస్టులకు 21 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2019 సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి.

AP Grama Sachivalyam hall ticket 2019: డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...


ముందుగా gramsachivalayam.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలోనే కేటగిరీ 1లోని అన్ని పోస్టులతో పాటు కేటగిరీ 3లో డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు హాల్ టికెట్స్ లింక్ కనిపిస్తుంది.
హాల్ టికెట్స్ లింక్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీ, అప్లికేషన్ ఐడీ, ఆధార్ నెంబర్‌లో ఏదో ఒకటి ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయొచ్చు.


హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

IAF Jobs: యువకులకు గుడ్ న్యూస్... ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

Scholarship: విద్యార్థులకు స్కాలర్‌షిప్... దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ
First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>