హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 నుంచి సీబీఎస్సీ విధానం.. ప్ర‌త్యేక‌త‌లు ఏంటీ?

Andhra Pradesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 నుంచి సీబీఎస్సీ విధానం.. ప్ర‌త్యేక‌త‌లు ఏంటీ?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

రాష్ట్ర వ్యాప్తంగా 2024 నాటిక‌ల్లా అన్ని పాఠ‌శాల‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధాన్ని పొందడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో స్టేట్ సెల‌బ‌స్‌, సీబీఎస్‌సీ సెల‌బ‌స్ విధానం గురించి తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  రాష్ట్ర వ్యాప్తంగా 2024 నాటిక‌ల్లా అన్ని పాఠ‌శాల‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధాన్ని పొందడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో ప్రతి పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు, ఆటస్థలాలు ఉండాలని, ఆట స్థలాలు లేని పాఠశాలలను మ్యాప్ చేయాలని, అవసరమైన భూములను సేకరించి, ఆ పాఠశాలల (Schools) కు ఆట స్థలాలను కేటాయించాలని, రాబోయే రోజుల్లో అన్ని ప్రీ-హైస్కూళ్లలో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అక్టోబ‌ర్ 11, 2021 న విద్యాశాఖ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల హాజ‌రు (Attendance), టీకా పంపిణీ వివ‌రాలను అధికారుల‌ను అడిగి తెలుసుకొన్నారు.

  ఈ స‌మీక్ష‌లో సీఎం ప్ర‌త్యేకంగా అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా చ‌ర్య‌లు తీసుకోవాలిన అధికారుల‌ను ఆదేశించారు. ప్రతీ పాఠ‌శాల‌కు ప్లే గ్రౌండ్  ఉండాలి.. స్కూల్‌ల‌ను మ్యాపింగ్‌చేసి.. ప్లే గ్రౌండ్‌(Play Ground) లేని చోట భూ సేకరణచేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలి.  aప్ర‌భుత్వం సీబీఎస్సీ విద్యావిధానం ప్ర‌వేశ పెట్ట‌బోతున్న‌నేప‌థ్యంలో స్టేట్ సెల‌బ‌స్‌కి, సెంట్ర‌ల్ సెల‌బ‌స్‌కి తేడాల‌ను తెలుసుకొందాం.

  TCS Openings : ఫ్రెషర్స్​కు టీసీఎస్ గుడ్​న్యూస్​.. 77 వేల మంది నియామకానికి సన్నాహాలు​


  సీబీఎస్‌సీస్టేట్ బోర్డ్‌
  ఈ విధానంలో ప‌దోత‌రగ‌తికిఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్, AISSE (క్లాస్ X)ఇంట‌ర్‌కు ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, AISSCE (క్లాస్ XII) అందిస్తారు.ఈ విధానంలో ప‌దోత‌ర‌గ‌తి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC)ఇంట‌ర్‌కు విడిగా బోర్డ్ ఆఫ్ ఇంట‌ర్మీడియ‌ట్ నుంచి స‌ర్టిఫికెట్ అందిస్తారు.
  అన్ని కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో CCE గ్రేడింగ్ వ్యవస్థ ఉంటుంది. అంటే ఆల్ఫాబెట్ విధానం అమ‌లు చేస్తారు.ప్రతి రాష్ట్రంలో వివిధ ర‌కాల గ్రేడింగ్ వ్య‌వ‌స్థ ఉంటుంది.
  సీబీఎస్సీలో దాదాపు ప్రతి సంవత్సరం సెల‌బ‌స్‌లో మార్పులు, స‌వ‌ర‌ణ‌లు చేస్తారు.స్టేట్ సెల‌బ‌స్‌లో మార్పులు చాలా అరుదుగా చేస్తారు.


  CBSE సిలబస్ విధానం..

  - సీబీఎస్‌సీలో సైన్స్, గణితం అప్లికేషన్ ఆధారిత సబ్జెక్టులపై ప్రధాన దృష్టి పెట్టబడుతుంది.

  - బోధనా విధానం ఇంగ్లీష్ అండ్‌ హిందీ.

  Telangana : "మ‌త్తు"పై ఉక్కుపాదం.. విస్తృతంగా పోలీసుల త‌నిఖీలు..


  - అన్ని కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు CBSE మార్గదర్శకాలను అనుసరించాలి.

  - ఇది సబ్జెక్టులలో శాస్త్రీయ పద్ధతులకు ప్రాముఖ్యతను ఇస్తుంది.

  - తరచుగా సిలబస్‌ని సమీక్షించి అప్‌డేట్ చేస్తుంది.

  స్టేట్ సెల‌బ‌స్ విధానం..

  - స్టేట్ బోర్డ్ ప్రాంతీయ భాష, సంస్కృతి, రాష్ట్ర స్థాయి అంశాల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది.

  - స్టేట్ బోర్డ్ స్కూల్స్‌లో అనుసరించే బోధనా విధానం ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషలు.

  - ముఖ్యంగా ప్రాక్టీక‌ల్ ఇంప్లికేష‌న్ (Practical Implication) అంశాల‌పై బోధ‌న ఉంటుంది.

  - స్టేట్ బోర్డులు అరుదుగా తమ సిలబస్, పాఠ్యాంశాలను అప్‌డేట్ చేస్తాయి.

  - రాష్ట్ర ప‌రిధిలో మాత్ర‌మే ఈ సిల‌బ‌స్ విధానం ఉంటుంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra pradesh news, Ap cm jagan, CBSE, EDUCATION, Education CBSE

  ఉత్తమ కథలు