• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ANDHRA PRADESH GOVT CHANGES QUALIFICATION CRITERIA FOR VILLAGE HORTICULTURE ASSISTANT JOBS KNOW HERE BA

ఏపీలో విలేజ్ హార్డికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హతలు మారాయ్

ఏపీలో విలేజ్ హార్డికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హతలు మారాయ్

ప్రతీకాత్మక చిత్రం

ఈ నెల 25 న నిర్వహించనున్న పరీక్షలకు మిగతా అర్హతలున్నవారు ఒక వేళ హాజరై పరీక్ష రాసినా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోరు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లోని విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి సంబంధించిన విద్యార్హతలు మారాయి. గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కొరకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతల నుంచి కొన్నింటిని తొలగించినట్లు ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తించిన 4 సంవత్సరాల బీఎస్సీ(హార్టికల్చర్), లేదా వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ నుంచి 2 సంవత్సరాల డిప్లొమో (హార్టికల్చర్) పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. ఇవి గాక మరే అర్హతలున్నా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని ఆయన వివరించారు. నియామకంలో భాగంగా ఈ నెల 25 న నిర్వహించనున్న పరీక్షలకు మిగతా అర్హతలున్నవారు ఒక వేళ హాజరై పరీక్ష రాసినా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని, అభ్యర్థులందరూ ఈ విషయం గమనించాలని కమిషనర్ చిరంజీవి చౌదరి కోరారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు