Andhra Pradesh Jobs: వచ్చే నెలలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ... ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Mega DSC | వచ్చే నెలలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అది కూడా ఏకంగా 7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మరో పండగే.

news18-telugu
Updated: December 9, 2019, 10:45 AM IST
Andhra Pradesh Jobs: వచ్చే నెలలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ... ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
(ప్రతీకాత్మక చిత్రం, File Photo: AP CM YS Jagan)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులపై వరాల వర్షం కురుస్తోంది. ఇప్పటికే గ్రామవాలంటీర్, వార్డ్ వాలంటీర్, గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్వాడీ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. దీంతో నిరుద్యోగులకు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో అంటే... 2020 జనవరిలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మెగా డీఎస్సీ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే నెలలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అది కూడా ఏకంగా 7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మరో పండగే.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Andhra Pradesh jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు... దరఖాస్తు లింక్ ఇదే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు... Indian Air Force Jobs: ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు