ANDHRA PRADESH GOVERNMENT TO FILL 15000 POLICE JOBS IN VARIOUS DEPARTMENTS SS
Police Jobs: ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో 15,000 ఖాళీలు
Police Jobs: ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో 15,000 ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)
Andhra Pradesh Police Jobs | ఆంధ్రప్రదేశ్లో త్వరలో 15,000 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశముంది. ఇప్పటికే ఖాళీలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపింది హోమ్ శాఖ.
పోలీస్ ఉద్యోగం మీ కలా? ఎలాగైనా పోలీస్ జాబ్ సంపాదించాలని ప్రిపేర్ అవుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో త్వరలో 15,000 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశముంది. పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటి విభాగాల్లో 15,000 ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనల్ని పంపింది హోమ్ శాఖ. వీటిలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే 11,000 ఖాళీలున్నాయి. సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ విభాగాల్లో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి పోస్టులున్నాయి. మిగతా 4,000 ఖాళీలు ఫైర్ డిపార్ట్మెంట్లో, జైళ్ల శాఖ, ఎస్పీఎఫ్లో ఉన్నాయి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మెన్, డిప్యూటీ జైలర్, వార్డర్, ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్ లాంటి పోస్టులున్నాయి. ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది హోమ్ శాఖ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయబోయే ఎగ్జామ్ క్యాలెండర్లో హోమ్ శాఖలోని 15,000 ఖాళీలను నోటిఫై చేసే అవకాశముంది. ఎగ్జామ్ క్యాలెండర్లో ఈ ఉద్యోగాలను ఎప్పట్లోగా భర్తీ చేస్తారో తేదీలు ఉంటాయి. దశలవారీగా ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశముంది. మరో రెండు, మూడు వారాల్లో ఈ పోస్టులకు సంబంధించి ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఇది గొప్ప శుభవార్తే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు విభాగాల్లో ఖాళీల భర్తీ జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.