Andhra Pradesh Jobs: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు... పరీక్షలు ఎప్పుడంటే

Grama Ward Sachivalayam Jobs | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షలు ఎప్పుడు నిర్వహించనుందో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 8, 2020, 10:29 AM IST
Andhra Pradesh Jobs: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు... పరీక్షలు ఎప్పుడంటే
Andhra Pradesh Jobs: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు... పరీక్షలు ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారా? శుభవార్త. వచ్చే నెలలో పరీక్షలు జరగనున్నాయి. జూలై చివరి వారంలో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతేడాది భారీగా గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల గ్రామ సచివాలయాల్లో 14062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2146 ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం 16,208 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఫిబ్రవరి 7వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. 11 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయింది.

ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభమైంది. రాతపరీక్షలు ఎలా నిర్వహించాలన్న అంశంపై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఇప్పటికే చాలా పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఇతర ఏజెన్సీలు కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆ పరీక్షలు జరిగే తేదీల్లో కాకుండా ఖాళీగా ఉన్న డేట్స్‌లో పరీక్షలు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ భావిస్తోంది. మొత్తం 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో వాటిని 8 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. పరీక్షలు జూలై చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. మరి మీరు కూడా గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసినట్టైతే సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 సచివాలయ ఉద్యోగాలకు సిలబస్ ఇదే

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 3,795 ఉద్యోగాలు... వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 8, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading