Ap Govt Schools: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. వేసవి సెలవుల (Summer Holidays) తరువాత పాఠశాలల పునః ప్రారంభాన్ని ఏపీ ప్రభుత్వం (AP Government) వాయిదా వేసింది. వేసవి సెలవుల తరువాత జూలై 4న తెరుచుకుంటాయని.. మొదట షెడ్యూల్ ప్రకారం ప్రకటించినా.. తాజాగా స్కూల్స్ జూలై 5 న తిరిగి ప్రారంభం అవుతాయని ప్రభుత్వం వర్గాలు ప్రకటించాయి. ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్య్ర విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలల రీ-ఓపెన్ డేట్‌ని వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో పాఠశాలలన్నీ జూలై 5న తెరుచుకోనున్నాయి. ప్రతి ఏడాది జూన్‌లో విద్యాసంస్థలను ప్రారంభించడం ఆనవాయితీ. ఐతే 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియలు కొంత ఆలస్యంగా జరిగినందున 2022-23 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవుతోంది.
జూలై 4వ తేదీన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. విశాఖ, భీమవరం, గుంటూరు జిల్లాలలో ప్రధాని టూర్ ఉంది. మొదట విశాఖలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. తరువాత భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రారంభోత్సవంలోనూ ప్రధాని పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలిపింది..
వాస్తవానికి ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తోంది. దాదాపు రెండేళ్ల సమయం ఉన్నా.. రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారంలో మునిగాయి. అందుకే బీజేపీ కూడా తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేశాయి. తెలంగాణ పర్యటన ముగిసిన తర్వాతే మోడీ ఏపీలో అడుగు పెడతారు. కేంద్రమంత్రులు కూడా ఆయనతో ఉంటారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో బీజేపీకి అంతగా ఓటుబ్యాంకు లేదు. ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం. కానీ పార్టీని మరింత విస్తరించాలని కమలదళం అనుకుంటోంది. అందుకే వరసగా పర్యటనలు చేస్తోంది.
ఇదీ చదవండి : ఎట్టకేలకు ఎలుగు అధికారులైతే చిక్కింది.. కానీ పాపం ఏం జరిగిందంటే?
ప్రస్తుతం ఏపీపైనా కేంద్ర పెద్ద ఫోకస్ చేశారు. ఇదులో భాగంగానే ఆయన.. ఇప్పుడు వరుస సభలకు హాజరువుతున్నారు. కొద్ది రోజుల తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఏపీకి రానున్నారు. మరోవైపు కేవలం ప్రధాని పర్యటన కోసం.. స్కూళ్ల రీ ఓపెనింగ్ వాయిదా వేస్తారా అంటూ విమర్శులు కూడా వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Schools, Narendra modi