Andhra Pradesh: ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. పూర్తి వివరాలివే..

సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది రోడ్డు రవాణ సంస్థ(APSRTC) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప్రమాద భీమా కల్పించనున్నట్లు ప్రకటించింది సర్కార్. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ ద్వరకా తిరుమలరావు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు బీమా అందించడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB), పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB), యాక్సిస్ బ్యాంక్(Axis Bank), హెచ్‌డీఎఫ్‌సీ(HDFC Bank)తో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ఈ బీమా సదుపాయం తో ఉద్యోగులకు రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు ప్రమాద బీమా అందుతుందన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు ఈ మొత్తాన్ని అందించనున్నారు. ఎవరైనా ఉద్యోగి సహజ మరణం పొందితే వారి కుటుంబానికి కూడా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు మరణించిన ఉద్యోగి పిల్లల చదువుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఆర్థిక సహాయం అందిస్తామని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
    Andhra Pradesh: ఏపీలోని ఆ జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

    ఇదిలా ఉంటే.. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలని... జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని సూచిచాంరు. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని తెలిపారు.

    ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నామని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మే, జూన్‌, జులై నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారని అధికారులు సీఎం జగన్‌కు ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ను వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: