హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Salaries Hike: ఏపీ సచివాల ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రొబేషన్ డిక్లరేషన్ జీఓ విడుదల.. కొత్త జీతాలు ఇవే

Salaries Hike: ఏపీ సచివాల ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రొబేషన్ డిక్లరేషన్ జీఓ విడుదల.. కొత్త జీతాలు ఇవే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (AP Sachivalayam Employees Salaries Hike) సీఎం జగన్ సర్కార్ (AP Government) శుభవార్త చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రెండేళ్లు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది జగన్ సర్కార్. ఈ మేరకు జీవోఎంఎస్‌ నెంబర్ 5ను (GO.Ms.05) జారీ చేసింది. ఇంకా సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ను సైతం ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేసింది. ఇంకా ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఉండేలా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే ఇందుకు సంబంధించిన జీఓ విడుదల కావాల్సి ఉంది.

అయితే.. ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగుల ప్రొబేషన్ కు సంబంధించిన ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా ఎన్నికలు ముగియడంతో ఈ జీవోను విడుదల చేసింది జగన్ సర్కార్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

Ammavodi: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అమ్మఒడికి కేబినెట్ ఆమోదం.. నగదు పడేది ఎప్పుడంటే?

కేవలం నాలుగు నెలల్లోనే ఇందుకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ముగిసింది. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్‌ నెలాఖరు కల్లా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి.. జూలై నెల అంటే.. ఆగస్టు 1న చెల్లించేలా పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్‌ గత జనవరిలో అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, Government jobs, JOBS, Village Secretariat Exams

ఉత్తమ కథలు