ఆంధ్రప్రదేశ్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ (AP Tenth, Inter Exams)కు సంబంధించిన షెడ్యూళ్లను ఇటీవల మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Minister Adimulapu Suresh) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ను, మే 2 నుంచి 13 వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంటర్ ఎగ్జామ్స్ ను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, టెన్త్ ఎగ్జామ్స్ ను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇదిలా ఉంటే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలపై (Exams) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షల పేపర్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టెన్త్ ఎగ్జామ్ ను 11 పేపర్లలో నిర్వహించేవారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను 7కు కుదించింది జగన్ సర్కార్.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను సైతం ఏడు పేపర్లతోనే నిర్వహించున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు ఒకే ఎగ్జామ్ ఉండగా.. ఒక సైన్స్ మాత్రం రెండు పేపర్లను నిర్వహించనున్నారు. ఇందులో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి 50 మార్కులకు ఒక పేపర్, జీవశాస్త్రానికి 50 మార్కులకు ఉంటుంది.
AP 10th Inter Exams: ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే..?
మిగతా అన్ని సబ్జెక్టులకు ఎగ్జామ్ ను ఒకే పేపర్ ద్వారా 100 మార్కులకు నిర్వహిస్తారు. అయితే, ఈ సిలబస్ కు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. విద్యార్థులు నేరుగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందు కోసం విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
AP SSC SUBJECT WISE MODEL QUESTION PAPERS:
Step 1: విద్యార్థులు మొదటగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో SSC Public Examinations - 2022 Model Paper ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3: తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4: ఆ పేజీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి న ఇంగ్లిష్, తెలుగు మోడల్ పేపర్లకు సంబంధించిన లింక్ లు కనిపిస్తాయి.
Step 5: ప్రతీ పేపర్ పక్కన Click Here అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap minister suresh, Exams, JOBS, Ssc exams