GGH Kakinada Jobs: కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

GGH Kakinada Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. మరో నోటిఫికేషన్ ద్వారా 311 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

news18-telugu
Updated: July 10, 2020, 4:36 PM IST
GGH Kakinada Jobs: కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
GGH Kakinada Jobs: కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. https://eastgodavari.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వెలువడింది. స్టాఫ్ నర్స్, రిసిప్షనిస్ట్ కమ్ క్లర్క్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు. ఆసక్తి గల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 జూలై 18 చివరి తేదీ.

Bank Jobs: బ్యాంక్ జాబ్ మీ కలా? 9640 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఐబీపీఎస్

GGH Kakinada Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే


చైల్డ్ సైకాలజిస్ట్- 1
రిసిప్షనిస్ట్ కమ్ క్లర్క్- 3
స్టాఫ్ నర్స్- 28+250
ల్యాబ్ టెక్నీషియన్- 04ఫార్మాసిస్ట్- 2
డార్క్ రూమ్ అసిస్టెంట్- 1
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 2
మేల్ నర్సింగ్ ఆర్డర్లీ- 10
ఫీమేల్ నర్స్ ఆర్డర్లీ- 10

DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు

GGH Kakinada Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 18
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్- 2020 జూలై 30
ఫైనల్ మెరిట్ లిస్ట్- 2020 ఆగస్ట్ 4
డాక్యుమెంట్ వెరిఫికేషన్- 2020 ఆగస్ట్ 5 నుంచి 7
అపాయింటింగ్ ఆర్డర్స్- 2020 ఆగస్ట్ 12

Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ నుంచి రూ.1,86,000 స్కాలర్‌షిప్... అర్హతలు ఇవే

GGH Kakinada Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- రూ.300
దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్:
Superintendent,
Government General Hospital,
Kakinada,
East Godavari District,
Andhra Pradesh.
Published by: Santhosh Kumar S
First published: July 10, 2020, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading