ANDHRA PRADESH GOVERNMENT RELEASED NOTIFICATION FOR SC ST BACKLOG POSTS IN GUNTUR DISTRICT NS
AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. అప్లై చేసుకోవడానికి ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) షెడ్యూల్ క్యాస్ట్/షెడ్యూల్ ట్రైబ్స్ కు సంబంధించిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలను (SC and ST Backlog Jobs) జిల్లాల వారీగా భర్తీ చేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలోని బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 43 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) పేర్కొన్నారు. జులై 1 తేదీ నాటికి 18-52 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నాను. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అబ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు.. 1.జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant): జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్సీ జనరల్ విభాగంలో రెండు, ఎస్టీ ఉమెన్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. 2.జూనియర్ స్టెనో (Junior Steno):ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ జనరల్ విభాగంలో 1, ఎస్టీ ఉమెన్ విభాగంలో 1 ఖాళీ ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎగ్జామినేషన్(తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్) పాసై ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. AP Job Mela: ఏపీలో Airtel, Apollo, Varun Motors తదితర సంస్థల్లో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూలు.. వివరాలివే
3.టైపిస్ట్(Typist):ఈ పోస్టులు 2 ఉన్నాయి. ఈ రెండు ఖాళీలు ఎస్సీ ఉమెన్ విభాగంలో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్వహించిన టైప్ రైటింగ్ పరీక్ష (Telugu&English) పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. 4.ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate): ఈ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ జనరల్ విభాగంలో 6, ఎస్సీ ఉమెన్ విభాగంలో 6, ఎస్టీ జనరల్ విభాగంలో 4. ఎస్టీ ఉమెన్ విభాగంలో 4 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 7వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు తప్పనిసరిగా సైకిల్ నడపడం వచ్చి ఉండాలి. NIELIT Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు.. రూ. 2 లక్షల వరకు వేతనం.. వివరాలివే
5.వాచ్ మెన్(Watchman):ఈ విభాగంలో 1 పోస్టు ఉంది. ఎస్సీ జనరల్ విభాగంలో ఈ ఖాళీ ఉంది. 5 వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. Ex-Serviceman అయి ఉండాలి. సైకిల్ నడపడం వచ్చి ఉండాలి. 6.స్వీపర్(Sweeper):ఈ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ ఉమెన్ విభాగంలో 4, ఎస్టీ జనరల్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. తెలుగు లేదా ఇంగ్లిష్ రాయడం, చదవడం వచ్చిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
7.వాచ్ మెన్(Watchman):ఈ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ జనరల్ 2, ఉమెన్ 2, ఎస్టీ జనరల్ 1, ఎస్సీ ఉమెన్ 1 ఖాళీ ఉంది. 7వ తరగతి పాసై, సైకిల్ నడపడం వచ్చిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 8. ఫిషర్ మెన్(Fisher Man):ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ జనరల్ ఉమెన్ 1, ఎస్టీ ఉమెన్ 1 ఖాళీ ఉంది. ఏడవతరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అబ్యర్థులు పశ్చిమగోదావరి జిల్లాలోని బాదంపూడిలో మూడు నెలల పాటు ఫిషరీస్ ట్రైనింగ్ పొంది ఉండాలి.
ఇతర అర్హతలు:
-కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.
-అభ్యర్థులు తప్పనిసరిగా గుంటురు జిల్లాకు చెందిన వారై ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1:అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://www.gunturap.in/scst/) ను ఓపెన్ చేయాలి. Step 2:అనంతరం APPLY ONLINE ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీకు ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. వాటి కింద Proceed to Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 3: అనంతరం మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టు, మీ కులాన్ని సెలక్ట్ చేసుకుని PROCEED పై క్లిక్ చేయాలి. Step 4:అనంతరం అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవతుంది. అప్లికేషన్ ఫామ్ లో పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్, చిరునామా, విద్యార్హతలు తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ఫామ్ పూర్తవుతుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.