హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Govt Jobs: ఏపీలో 1458 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

AP Govt Jobs: ఏపీలో 1458 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ డీఎంఈ ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ డీఎంఈ (DME AP) ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 విభాగాల్లో ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో (AP Jobs Notifications) స్పష్టం చేశారు.

విభాగాలు:

జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, రెస్పీరేటరీ మెడిసిన్, సైకియాట్రి, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ, న్యూరో సర్జరీ, సర్జికల్ ఆంకాలజీతో పాటు మొత్తం 49 విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఎల్లుండి మరో భారీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

అర్హత:

మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డీఎం/ఎంసీహెచ్/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వ మెడికల్&డెంటల్ కాలేజీల్లో పీజీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలి.

వేతనాలు:

రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.85 వేలు, రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ (పీజీ) అభ్యర్థులకు రూ.70 వేలు, రెసిడెంట్ డెంటిస్ట్ (పీజీ) అభ్యర్థులకు రూ.65 వేల వేతనం ఉంటుంది.

ఒప్పంద కాలం:

ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఎంపిక ఇలా: పీజీలో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే..

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.dme.ap.nic.in/ ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం Notification For The Posts of Senior Residents-2022 - Online Application  ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, Health jobs, JOBS, State Government Jobs

ఉత్తమ కథలు