ANDHRA PRADESH GOVERNMENT RELEASED JOB NOTIFICATION FOR VARIOUS VACANCIES AT EAST GODAVARI DISTRICT NS
AP Jobs: ఏపీలో కరోనా.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మకచిత్రం
ఏపీలో పలు ఉద్యోగాల (AP Jobs) భర్తీకి అధికారులు తాజాగా జాబ్ నోటిఫికేషన్ (AP Job Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా కరోనా (Corona) మహమ్మారి కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించాయి. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలను త్వరతిగతిన చేపడుతున్నాయి. ఈ మేరకు ఏపీలోని జగన్ సర్కార్ (AP Government) జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లను (Job Notifications) విడుదల చేస్తోంది. తాజాగా తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో OC(W) విభాగంలో 1, OC-G(EWS) విభాగంలో-1, ఎస్సీ(W) విభాగంలో 1, బీసీ-ఏ(W)-1, బీసీ-ఏ(జీ) విభాగంలో 2, బీసీ-డీ(W) విభాగంలో 1, బీసీ-(W)-1, పీహెచ్-HH(G)-1 ఖాళీ ఉంది. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.53,495 వేతనం చెల్లించనున్నారు.
ఎలా అప్లై చేయాలంటే..
-అభ్యర్థులు మొదట ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
-అనంతరం అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను పూర్తిగా నింపాలి.
-అప్లికేషన్ ఫామ్ కు టెన్త్, ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్, ఏపీ మెడికల్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ ప్రతం తదితర పత్రాల కాపీలను జత చేయాల్సి ఉంటుంది. Jobs for Freshers: ఫ్రెషర్స్ గుడ్ చాన్స్.. నెలకు రూ.29,000 వేతనం.. అప్లికేషన్ ప్రాసెస్
-అభ్యర్థులు DM&HO Office, Kakinada చిరునామాలో దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.