ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జూన్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 7 నుంచి 14 వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఒక్క సైన్స్ మినహా అన్ని సబ్జెక్టులను ఒక్కో పేపర్ ద్వారానే పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, జూన్ 8న సెకండ్ లాంగ్వేజ్, జూన్ 9న ఇంగ్లీష్, జూన్ 10న మ్యాథ్స్, జూన్ 11న ఫిజికల్ సైన్స్, జూన్ 12న బయోలాజికల్ సైన్స్, జూన్ 14న సోషల్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆ తరువాత రెండు రోజుల్లో ఇతర వొకేషనల్ కోర్సులకు సంబంధించిన వారికి పరీక్షలు జరగనున్నాయి. ఒక్క సైన్స్ మినహా అన్ని సబ్జెక్టులకు 3 గంటల 15 నిమిషాలుగా పరీక్ష సమయాన్ని నిర్ణయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు వరకు పరీక్ష జరగనుంది. ఇక సైన్స్ సబ్జెక్టుకు మాత్రం 2 గంటల 45 నిమిషాల సమయం కేటాయించారు.
ఇక జూన్ 17 నుంచి జూన్ 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించి.. జూలై 5న పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు. ఇక కరోనా వల్ల బడులను తిరిగి ప్రారంభించడంలో జాప్యం జరిగినందున ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 166 రోజుల పాటు జూన్ 5 వరకు క్లాసులు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ssc exams