D.Ed. Exams: డిఎడ్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... అలా చేస్తున్నారు

Andhra Pradesh D.Ed. Exams: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎడ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి కొత్త నిర్ణయం ఒకటి తీసుకుంది.

news18-telugu
Updated: September 26, 2020, 12:19 PM IST
D.Ed. Exams: డిఎడ్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... అలా చేస్తున్నారు
డిఎడ్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం (File)
  • Share this:
D.Ed. Exams in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి జరగవలసి ఉన్న డిఎడ్ పరీక్షలను కోవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారమైతే... D.El.Ed ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 28న జరగాల్సి ఉంది. విద్యా శాఖ అధికారులు అందుకు ఏర్పాట్లు కూడా చేయాలనుకున్నారు. అంతలోనే కరోనా వైరస్ చాలా ఎక్కువగా ఉండటం, రోజూ 7 వేల దాకా కొత్త కేసులు వస్తుండటంతో... ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరపడం కష్టమేనని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఇప్పటికే స్కూల్ విద్యార్థుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం... ఈ పరీక్షల విషయంలోనూ అంతే సీరియస్‌గా ఉంది. కొంపలు మునిగినట్లు కరోనా టైమ్‌లో పరీక్షలు జరపాల్సిన అవసరం ఏముంది? కొన్ని రోజులు అగితే... కరోనా కంట్రోల్ అవుతుంది. అప్పుడు జరపడం బెటరనే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

డిఎడ్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వు


తాజా ఆదేశం ప్రకారం... ఈ పరీక్షలు మళ్లీ ఎప్పుడు జరిపేదీ తెలపలేదు. నెక్ట్స్ ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ పరీక్షలు జరగబోవని తెలిపింది. కాబట్టి ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు... వీటిపై ఫోకస్ తగ్గించుకొని... ఇంత అంశాలపై దృష్టి మరల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లే.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,073 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 661458కి పెరిగింది. కొత్తగా 48 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5606కి చేరింది. కొత్తగా 8,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,88,169 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 67,683 యాక్టివ్ కేసులున్నాయి. (credit - twitter - reuters)

ఇండియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 85362 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 59,03,932కి పెరిగింది. అలాగే... 24 గంటల్లో 1089 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 93,379కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.6 శాతం ఉండగా... ప్రపంచ దేశాల్లో అది 3 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 93420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అందువల్ల మొత్తం రికవరీ కేసుల సంఖ్య 4849584కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు మరింత పెరిగి 82.1 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 960969కి చేరింది. ఇండియాలో నిన్న 13లక్షల 41వేల 535 టెస్టులు చేశారు. మొన్నటి కంటే 150874 టెస్టులు తక్కువగా జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 7కోట్లను దాటింది.
Published by: Krishna Kumar N
First published: September 26, 2020, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading