ఏపీలోని విజయనగరం (Vijayanagaram) జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అంగన్ వాడీ (anganwadi) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అంగన్ వాడీలు 10, అంగన్ వాడీ హెల్పర్స్ 73, మినీ అంగన్ వాడీ హెల్పర్స్ విభాగంలో మరో 3 ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1:అభ్యర్థులు ముందుగా విజయనగరం జిల్లా అధికారిక వెబ్ సైట్ ను ఈ లింక్ ద్వారా ఓపెన్ చేయాలి. Step 2:హోం పేజీలో Anganwadi Helper, Worker, Mini Anganwadi Workers Notification పేరుతో లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. Step 3:అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అంగన్ వాడీ అప్లికేషన్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. Step 4:ఆ అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నింపాలి. నింపిన ఫామ్ ను శిశు అభివృద్ధి పథకపు అధికారిణి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, విజయనగరం, ఏపీ చిరునామాకు ఈ నెల 23లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.