ANDHRA PRADESH GOVERNMENT INVITING APPLICATIONS FOR VARIOUS MEDICAL JOBS VACANCIES HERE DETAILS NS
AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government Jobs) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ (Government Of Andhra Pradesh
Health Medical & Family Welfare Department) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 31 పోస్టులను (Andhra Pradesh Government Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా.. అభ్యర్థులకు 42 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. ఇంకా మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకుని ఉండాలి. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్ల పాటు సడలింపు ఇచ్చారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు hmfw.ap.gov.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆరోజు సాయంత్రం 5.30 గంటలలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. UPSC Civils Exam: సివిల్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారా.. ప్రిపరేషన్ టైమ్లో ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.