కరోనా (Corona) ప్రారంభం నాటి నుంచి దేశ వ్యాప్తంగా వైద్య విభాగంలో ఖాళీల (Medical Jobs) భర్తీకి అధికారులు ఆయా ప్రభుత్వాలు వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వైద్య శాఖ బలోపేతానికి ఆయా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (DMHO) కార్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నిన్నటి నుంచి అంటే జూన్ 6 నుంచి ప్రారంభమైంది. కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
స్పెషలిస్ట్ డాక్టర్ - అబ్ స్టెట్రిక్స్ & గైనకాలజీ | 7 |
జనరల్ మెడిసిన్- Geriatric | 7 |
ఈఎన్టీ | 7 |
పీడియాట్రిక్స్ | 6 |
స్కిన్ | 6 |
ఆర్థోపపెడిక్స్ | 6 |
ఛాతి నిపుణులు | 10 |
జనరల్ మెడిసిన్ -NCD | 9 |
జనరల్ సర్జరీ | 7 |
మొత్తం: | 72 |
విద్యార్హతలు: ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలోఎండీ/ఎంఎస్/డీఎన్బీ/డిప్లొమా విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అర్హులు. అభ్యర్థులకు ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,10,000 వేతనం చెల్లించనున్నారు.
ఎంపిక: అర్హత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. రిజర్వేషన్ ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయి.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా కర్నూలు జిల్లాకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ https://kurnool.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో NOTICES విభాగంలో Recruitments ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3: మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో NHM – Recruitment of Specialist Doctors విభాగంలో Application Form ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో కావాల్సిన వివరాలను నింపాలి.
Step 5: పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ ను డీఎంహెచ్ఓ, కర్నూలు జిల్లా, ఏపీ చిరునామాలో ఈ నెల 10వ తేదీలోగా అందించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Health jobs, JOBS, State Government Jobs