Technical Certificate Course: ఏపీలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తు చేయండిలా

Technical Certificate Course | మరిన్ని వివరాలను http://www.bseap.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: November 29, 2019, 12:44 PM IST
Technical Certificate Course: ఏపీలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తు చేయండిలా
Technical Certificate Course: ఏపీలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తు చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు టెక్నికల్ కోర్స్ ఏదైనా చేయాలనుకుంటున్నారా? చేనేత, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్ లాంటి కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సును ప్రకటించింది. హ్యాండ్‌లూమ్ వీవింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్ కోర్సుల్ని లోయర్, హయ్యర్ గ్రేడ్స్‌లో అందిస్తోంది. ఈ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 6 చివరి తేదీ. మీరు ఎంచుకునే కోర్సును బట్టి ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను http://www.bseap.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Technical Certificate Course: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 21

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 6
రూ.50 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 13
రూ.75 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 20


Technical Certificate Course: ఫీజు వివరాలు

డ్రాయింగ్ (లోయర్ గ్రేడ్)- రూ.100
డ్రాయింగ్ (హయ్యర్ గ్రేడ్)- రూ.150
హ్యాండ్‌లూమ్ వీవింగ్ (లోయర్ గ్రేడ్)- రూ.150
హ్యాండ్‌లూమ్ వీవింగ్ (హయ్యర్ గ్రేడ్)- రూ.200
టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ (లోయర్ గ్రేడ్)- రూ.150
టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ (హయ్యర్ గ్రేడ్)- రూ.200

దరఖాస్తు విధానంతో పాటు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Navy Jobs: ఇండియన్ నేవీలో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు... ఇంటర్, బీటెక్ అర్హత

SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 మేనేజ్‌మెంట్ ట్రైనీ జాబ్స్... నోటిఫికేషన్ డీటైల్స్

Power Grid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>