ఆంధ్రప్రదేశ్లో 16,208 గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తుకు ఫిబ్రవరి 7 వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. గ్రేడ్ 2 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు విద్యార్హతలను సడలించడంతో అర్హతలు ఉన్నవారికి దరఖాస్తు చేసేందుకు ఛాన్స్ ఇవ్వడానికి గడువు పెంచింది. చివరి తేదీ దగ్గరకొచ్చేస్తోంది. అప్లై చేయాలనుకునేవారు ఫిబ్రవరి 7 లోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 16,208 పోస్టుల్ని భర్తీ చేసేందుకు గతనెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. http://gramasachivalayam.ap.gov.in/ లేదా http://wardsachivalayam.ap.gov.in/ వెబ్సైట్లలో దరఖాస్తు చేయొచ్చు. గ్రామ సచివాలయాల్లో 14,062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2,146 ఖాళీలున్నాయి. ఇంటర్ నుంచి విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేయాలి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
AP Jobs: ఏపీలో 16,208 సచివాలయ ఉద్యోగాలు... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్లో 16,208 సచివాలయ ఉద్యోగాలకు ఎగ్జామ్ సిలబస్ ఇదే
Union Budget 2020: కాలేజీకి వెళ్లకుండానే డిగ్రీ... ఆన్లైన్లో కోర్సులు...Published by:Santhosh Kumar S
First published:February 05, 2020, 10:23 IST