ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ లాంటి పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,317 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం (AP Government). ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ (Outsourcing Jobs) పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్ ఆస్పత్రుల్లో రెగ్యులర్ పద్ధతిలో 896 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రకటించిన 1,317 పోస్టులకు పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హతలు తెలుసుకోండి.
Post Office Jobs: పోస్ట్ ఆఫీసుల్లో 257 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు | 1317 | విద్యార్హతలు | వయస్సు | వేతనం |
ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ | 839 | 10వ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఉండాలి. | 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. | రూ.12,000 |
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్ | 312 | 10వ తరగతి పాస్ కావాలి | 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. | రూ.12,000 |
ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 | 17 | డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పాస్ కావాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. | 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. | రూ.28,000 |
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 | 124 | 10వ తరగతితో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా పాస్ కావాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. | 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. | రూ.28,000 |
LIC Recruitment 2021: ఎల్ఐసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
ఎంపిక విధానం- మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, AP News, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, State Government Jobs, Telugu news, Telugu varthalu