ANDHRA PRADESH GOVERNMENT 10TH CLASS EXAM FEES FEBRUARY 10TH IS LAST DATE UNDER TATKAL SCHEME SS
10th Exams: టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఫిబ్రవరి 10 చివరి తేదీ
ప్రతీకాత్మక చిత్రం
Andhra Pradesh 10th exam fees Tatkal Scheme | ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి విద్యార్థులకు మరో అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తత్కాల్ స్కీమ్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్థులు తత్కాల్ స్కీమ్‌లో పరీక్ష ఫీజు చెల్లించడానికి ఫిబ్రవరి 10 చివరి తేదీ. ఎగ్జామ్ ఫీజు చెల్లించనివారికి మరో అవకాశం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం తత్కాల్ స్కీమ్ ప్రకటించింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు 2017 నుంచి 2019 మధ్య కొత్త ప్యాటర్న్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఫీజు చెల్లించొచ్చు. తత్కాల్ స్కీమ్‌లో ఎగ్జామ్ ఫీజు చెల్లించి 2020 మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలు రాయొచ్చు. విద్యార్థులు 2020 ఫిబ్రవరి 10 లోగా ఫీజు చెల్లించాలి. పరీక్ష ఫీజుతో పాటు ఆలస్య రుసుము రూ.1,000 చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ జారీ చేసిన నోటీసు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.
ఏపీలో టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే...
మార్చి 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 24- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 26- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 27- ఇంగ్లీష్ పేపర్ 1
మార్చి 28- ఇంగ్లీష్ పేపర్ 2
మార్చి 30- గణితం పేపర్ 1
మార్చి 31- గణితం పేపర్ 2
ఏప్రిల్ 1- సైన్స్ పేపర్ 1
ఏప్రిల్ 3- జనరల్ సైన్స్
ఏప్రిల్ 4- సోషల్ స్టడీస్ పేపర్ 1
ఏప్రిల్ 6- సోషల్ స్టడీస్ పేపర్ 2
ఏప్రిల్ 7- సంస్కృతం, అరబిక్, పర్షియన్
ఏప్రిల్ 8- వొకేషనల్ పరీక్షలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.