AP Job Mela: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో పది కంపెనీల్లో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ - APSSDC నుంచి ఇటీవల భారీగా ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 5 న ఉదయం 10 గంటలకు శ్రీ రాజ గవర్నమెంట్ హై స్కూల్, మెయిన్ రోడ్, తుని-తూర్పు గోదావరి జిల్లా చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో పది ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
    AP Employment News: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై జాబ్ అలర్ట్స్ చాలా ఈజీ..
    ONGC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ONGCలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్

    1. Hero Moto Corp: ఈ సంస్థలో టెక్నీషియన్ విభాగంలో 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ITI చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 14,475 వేతనం చెల్లించనున్నారు.
    2.Innov Source Pvt Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులెవరైనా ఈ ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. ఎంపికైనా వారికి నెలకు రూ. 13 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    3.Raising Star Mobiles India Pvt Ltd(LED Tv’S): ఈ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్ విబాగంలో 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతల కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 11500 వరకు వేతనం చెల్లించనున్నారు.
    4.Amar Raja Batteries Ltd: ఈ సంస్థలో 180 ఖాళీలను మెషిన్ ఆపరేటర్ విభాగంలో భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10600 వేతనం చెల్లించనున్నారు.
    5.Appollo Pharmacy: ఈ సంస్థలో ఫార్మసిస్ట్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. D/B/M ఫార్మసీ PCI సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.15 వేల వరకు అందించనున్నారు.

    6.Flipkart: ఈ సంస్థలో 80 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్/ఇంటర్/డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
    7.Good Worker(Zomato): ఈ సంస్థలోనూ 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వరకు చెల్లించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.
    8.Airtel Payments: ఈ సంస్థలో 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. MBA చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు చెల్లించనున్నారు.
    9.MedPlus: ఈ సంస్థలో 45 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్/ఫార్మా ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్/డిగ్రీ&B/M ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల నుంచి రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    10.SBI Life Insurance: లైఫ్ మిత్రా/సేల్స్ మేనేజర్&యూనిట్ మేనేజర్ విభాగంలో 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.



    ఇతర వివరాలు: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9949500473 నంబర్ ను సంప్రదించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: