Home /News /jobs /

Andhra Pradesh: ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దు..! స్పష్టత ఇచ్చిన ఏపీ మంత్రి

Andhra Pradesh: ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దు..! స్పష్టత ఇచ్చిన ఏపీ మంత్రి

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై క్లారిటీ

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై క్లారిటీ

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు అయినట్టేనా..? ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యల అర్థం అదేనా.. మొన్నటి వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించి తీరుతామని చెప్పిన ఆయన.. ఇప్పుడు మాట మార్చారా..?

  ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతోంది ప్రభుత్వం.. ముఖ్యంగా పది, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.. పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా..? ఎప్పుడు జరుగుతాయి..? జరిగితే ఎలా నిర్వహిస్తారు..? ఎప్పుడు నిర్వహిస్తారు..? పక్క రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ తప్పకుండా నిర్వహించాలి అనుకుంటే.. నేరుగా తేదీ ప్రకటించి.. ఆ తేదీన పరీక్షలు నిర్వక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టత ఇవ్వాలి.. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలు రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు. విపక్ష నేతలు సైతం అదే డిమాండ్ వినిపిస్తున్నారు. ఇటు కోర్టులు సైతం ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్దున్నియొ. ఈ నేపథ్యంలో ఎదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం.. మాత్రం ఇప్పటికు స్పష్టత ఇవ్వడం లేదు.. దీంతో పరీక్షలు ఉంటాయా..? ఉండవా అన్నది తేల్చుకోలేక.. పోనీ పరీక్షలకు సిద్ధమవుదాం అంటే ప్రస్తుతం చాలావరకు పరిస్థితులు అందోళనకరంగానే ఉన్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ అనే భయం వెంటాడుతోంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలపై ప్రభావం చూపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం సైతం థర్డ్ వేవ్ భయం నేపథ్యంలోని ముందుగానే అలర్ట్ అయ్యింది. స్వయంగా సీఎం జగనే థర్డ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను సూచించారు. అంటే థర్డ్ వేవ్ ఉంటుందనే భయం ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సరైన నిర్ణయం అనే ప్రశ్న ఎదురవుతోంది...

  తాజాగా ఏపీలో పది ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.. మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లలో పరీక్షలు నిర్వహిస్తామని నొక్కి చెప్పేవారు.. తాజాగా ఆయన మాటల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ఏపీలో అప్పటి పరిస్థితుల బట్టి పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అంటే పరిస్థితులు అనుకూలించడం లేదని పరీక్షలు వాయిదా వేసేందుకే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆగస్టు నుంచి కొత్త విద్యా సంవస్థరం ఆరంభమయ్యే అవకాశం ఉంటుంది.. అంటే జులైలో తప్పక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటికి పూర్తిగా కరోనా కేసులు తగ్గుతాయనే స్పష్టత లేదు. అంతేకాదు థర్డ్ వేవ్ రూపంలో మరో భయం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో జులైలో పరీక్షలు అంటే నిర్వహణ కత్తిమీద సామే.. అలా అని ఇంకా లేటు చేస్తే అన్ని రాష్ట్రాల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. అప్పుడు పరీక్షలు అంటే విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు భయపడుతున్నారు..

  ఇప్పటికే పలువురు అధికారులు పరీక్షలు రద్దు చేయడమే బెటరని నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. చాలామంది ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణ కోసం విధుల్లోకి రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే సెకెండ్ వేవ్ లో భారీగా ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తాము రిస్క్ చేయలేమని అంటున్నారు.. అందుకే ఇప్పుడు ప్రభుత్వం సైతం అప్పటి పరిస్థితిని బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని చెబుతోందనే వాదన వినిపిస్తోంది...

  మరోవైపు పరీక్షల రద్దు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి. అటు కేంద్ర పెద్దలకు సైతం లేఖలు రాస్తూనే ఉన్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు. మరోసారి ఏపీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిపుణుల నుంచి ఆయన అభిప్రాయప సేకరణ చేపడుతున్నారు. సుమారు ఐదు లక్షల మంది తన వాదనతో ఏకీభవించారని.. పరీక్షలు రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారని లోకేష్ అంటున్నారు. లోకేష్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు చేస్తే కచ్చితంగా పరీక్షలు రద్దవుతాయనే అంతా భావిస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP inter board, Ap minister suresh, AP News, Nara Lokesh, Ssc exams

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు