AP EAMCET 2019 : ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా..

AP EAMCET Results | ఏపీలో ఎంసెట్ ఫలితాల ప్రకటన వాయిదా పడింది. మే 1న విడుదల కావాల్సిన ఫలితాలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.

news18-telugu
Updated: May 1, 2019, 5:52 PM IST
AP EAMCET 2019 : ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 1, 2019, 5:52 PM IST
ఏపీలో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నిరీక్షణే ఎదురైంది. అనివార్య కారణాల రీత్యా ఫలితాల ప్రకటన వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందుగా మే 1 మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడి అవుతాయని కాకినాడ జేఎన్‌టీయూ రిజల్ట్స్ రిలీజ్ చేస్తుందని వార్తలొచ్చాయి. దీంతో.. విద్యార్థులంతా ఆతృతగా ఎదురుచూశారు. కానీ.. తీరా సమయానికి ఫలితాలను వాయిదా వేశారు అధికారులు.

అయితే, ఫలితాల వాయిదా వెనుక ఇంటర్ మార్కుల కారణమే ఉన్నట్లు తెలుస్తుంది. గ్రేడింగ్ విధానంలో ఇంటర్ రిజల్ట్స్ విచ్చినప్పటికీ ఎంసెట్ కోసం మార్కులు ఇవ్వాలని సీఎస్ స్పష్టం చేశారు. గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు రావడంతో ఎంసెట్‌కు వెయిటేజీ ఎలా ఇవ్వాలనే దానిపై అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. వీటితో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఫలితాల వాయిదాకి కారణమని తెలుస్తుంది.

మరోవైపు, తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన వివాదం ఏపీ ఎంసెట్ రిజల్ట్‌పై ప్రభావం చూపింది. 20వేల మంది తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాశారు. దీంతో.. వారికి ర్యాకుల కేటాయింపు ఎలా ఇవ్వాలో తెలీక వాయిదా పడ్డట్లు తెలుస్తోంది..

మొత్తానికీ వాయిదాపడ్డ రిజల్ట్స్ మే మూడోవారంలో రిలీజ్ కానున్నాయి.

First published: May 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...