ANDHRA PRADESH DMHO CONDUCTING INTERVIEWS ON NOV 15 FOR VARIOUS JOB VACANCIES SALARY UP TO 1 10 LAKH NS
Jobs in AP: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో 126 ఖాళీలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో పలు ఉద్యోగాల(Jobs) భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్(Jobs Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు(Job Notification) విడుదల చేస్తోంది. జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి సంబంధిత డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం(DMHO) పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. మొత్తం 126 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ (Specialist Doctor) విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 15న గుంటూరులోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
స్పెషలైజేషన్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
S.No
స్పెషలైజేషన్
ఖాళీలు
1
అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ
14
2
జీరియాట్రిక్
14
3
ఈఎన్టీ(ENT)
14
4
పీడియాట్రిక్స్
14
5
స్కిన్
14
6
ఆర్థోపెడిక్స్
14
7
చెస్ట్
14
8
NCD
14
9
జనరల్ సర్జరీ
14
విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు తప్పనిసరిగా MBBS విద్యార్హత కలిగి ఉండాలి. దీంతో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ (MD/MS) ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. APPSC Recruitment 2021: బీటెక్ అర్హతతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
పూర్తిగా నింపిన దరఖాస్తులకు టెన్త్ మార్కుల జాబితా, 4 నుంచి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ను జత చేసి ఇంటర్వ్యూకు వెంట తీసుకురావల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశంలో అభ్యర్థులు కరోనా నిబంధనలు పాటించాలని ప్రకటనలో(Job Notification) స్పష్టం చేశారు. అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వేతనం:ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.10 లక్షల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.