Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు (Outsourcing Jobs) కోరుకునేవారికి అలర్ట్. పలు ఖాళీల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మరో 2 రోజుల్లో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్-విజయవాడ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్మెన్, స్వీపర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 23 ఖాళీలున్నాయి. ఇవి ఔట్సోర్సింగ్ పోస్టులు (Outsourcing Jobs) మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పోస్టులో పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 20 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు నిబంధనలు- ఒక అభ్యర్థి వేర్వేరు పోస్టులకు దరఖాస్తు వేర్వేరు అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేస్తే విద్యార్హతలను పరిగణలోకి తీసుకొని ఒకే దరఖాస్తుగా పరిగణిస్తారు.
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి,
నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 నవంబర్ 20 సాయంత్రం 5 గంటల్లోగా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Director of Industries,
1st Floor, Government Printing Press Buildings,
Muthyalamapadu, Vijayawada.
PIN Code- 520011
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.