• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY REVIEW ON HIGHER EDUCATION AND DECIDED TO IMPLEMENT ENGLISH MEDIUM IN DEGREE COLLEGES ALONG WITH ONLINE COURSES HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: డిగ్రీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఇకపై ఇంగ్లీష్ మీడియం, ఆన్ లైన్ కోర్సులు..

Andhra Pradesh: డిగ్రీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఇకపై ఇంగ్లీష్ మీడియం, ఆన్ లైన్ కోర్సులు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) కీలకనిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ ఛైర్‌ పర్సన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అన్ని డిగ్రీకాలేజీల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల మాదిరిగానే ఇంగ్లీష్ లో బోధించాలని సీఎం ఆదేశించారు. వెంటనే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా దీనికి తగిన కోర్సులను తీసుకురావాలని సీఎం సూచించారు. డిగ్రీ మొదటి ఏడాదిలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలని., అలాగే 11, 12 తరగతులుకూడా ఇంగ్లీష్ మీడియం చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పాఠ్యపుస్తకాలన్నీ ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించాలని పేర్కొన్నారు. బీఎ, బీకాం లాంటి కోర్సులు చేసి.. ఇంగ్లిషులో మాట్లాడలేకపోతే.. విద్యార్థులు పోటీప్రపంచంలో రాణించడం కష్టమవుతుందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

    విద్యార్థుల కోసం ఆన్ లైన్ కోర్సులు తీసుకురావడంతో పాటు ప్రతి గ్రామానికీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. దీంతోపాటు అమ్మ ఒడి, వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లను సరసమైన ధరకు వచ్చేలా చూస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యారంగంలో, నైపుణ్య రంగంలో పెనుమార్పులను తీసుకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోసం ఇంటర్నెట్‌లేని వైఫై ప్రోటోకాల్‌ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జగన్ ప్రకటించారు. రిమోట్‌ డివైజ్‌ ద్వారా ఒకేసారి 500 మంది యూజర్లు కనెక్ట్ అవుతారని.. ఒక్కో రిమోట్‌ డివైజ్‌ పరిధి 100 మీటర్లు ఉంటుందన్నారు. వీటితో ల్యాప్‌ టాప్, ట్యాబ్, టీవీలతో కనెక్ట్‌ అవడమే కాకుండా క్షణాల్లో డేటా ట్రాన్స్‌ ఫర్‌ అవుతుందన్నారు. ఫైబర్ ఇంటర్నెట్‌ సౌకర్యం వచ్చిన తర్వాత కూడా ఆ సదుపాయం వాడుకునేలా డివైజ్‌లు రూపొందించే ప్రాజెక్టుకు సీఎం అంగీకారం తెలిపారు.

    ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్‌ -2006ను సవరించడంపై సమావేశంలో చర్చించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చట్టానికి సవరణల ప్రతిపాదనలు చేశారు. ప్రైవేటు యూనివర్శిటీల్లో 35శాతం సీట్లు గవర్నమెంటు కోటాకింద భర్తీకి ప్రతిపాదించారు. ఇప్పుడున్నకాలేజీలను ప్రైవేటు యూనివర్శిటీలుగా మార్చాలంటే కూడా అత్యుత్తమ ప్రమాణాలను నిర్దేశించాలని సీఎం ఆదేశించారు. ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్ధలతో ఐదేళ్ల కాలపరిమితితో జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఉండాలని.. ఈ సర్టిఫికేషన్ ఉంటేనే ప్రైవేటు యూనివర్శిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్‌ -2006కు సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

    రాష్ట్రంలో ఎయిడెడ్ కాలేజీల నిర్వహణపై సమావేశంలో కీలక చర్చ జరిగింది. ఎయిడెడ్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వంలోనైనా లేక ప్రైవేటు యాజమాన్యాల చేతిలోనైనా ఉండాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి పూర్తిగా అప్పగిస్తే.. ప్రభుత్వమే నడపాలని, లేని పక్షంలో ప్రైవేటు యాజమాన్యాలే నడుపుకోవాలని నిర్ణయించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు